Pune Crime News:11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. 3 నెలల గర్భవతి

Published : Feb 11, 2022, 10:42 AM IST
Pune Crime News:11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. 3 నెలల గర్భవతి

సారాంశం

Pune Crime News: అభం శుభం తెలియని 11 ఏండ్ల బాలికపై ఓ దుర్మార్గుడు కామవాంఛలతో చెలరేగిపోయాడు.  భయపెట్టి లొంగదీసుకుని గర్భవ‌తిని చేశాడు. ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చిన ఈ ఘ‌ట‌న  పూణేలోని ఉరులి కంచన్ పట్టణంలో చోటుచేసుకుంది.    

Pune Crime News: ప్ర‌స్తుత‌ సమాజంలో నేరాలు, ఘోరాలు అడ్డుఅదుపు లేకుండా పెరిగిపోతున్నాయి.  మ‌రి ముఖ్యంగా మ‌హిళ‌ల‌పై హత్యలు, అత్యాచారాలు, ఆత్మహత్యలు ఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన చట్టాలు తీసుకువచ్చినా.. ఇలాంటి ఘటనలు మాత్రం ఆగడం లేదు. ఎక్కడో ఓ చోట.. ఏ ఏదోక ప్రాంత్రంలో దారుణాలు జ‌రుగుతునే ఉన్నాయి.
 
తాజాగా మ‌హారాష్ట్ర లోని పూణేలో ఓ దారుణ ఘటన వెలుగుచూసింది. అభం శుభం తెలియని బాలికపై ఓ దుర్మార్గుడు కామవాంఛలతో చెలరేగిపోయాడు. ఆమెను భయపెట్టి లొంగదీసుకున్నాడు. శారీరక సుఖం పొందాడు. ఏం జరిగిందో తెలియని వయసులో గర్భం దాల్చిన ఆ బాలిక. ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైనర్ బాలికపై అత్యాచారం చేసి గర్భవతిని చేసిన ఘటన పూణేలోని ఉరులి కంచన్ పట్టణంలో చోటుచేసుకుంది.  ఉరులి కంచన్ ప్రాంతంలో గ్యారేజీ మెకానిక్ గా ప‌ని చేస్తున్న కామంధుడు.. ప‌క్కింట్లో ఉన్న అభం శుభం తెలియని పన్నెండేళ్ల బాలికపై కన్నేశాడు. ఈ క్రమంలో గ‌తేడాది అక్టోబర్‌లో ఇంట్లో లేని సమయంలో  బాలిక‌ను బెదిరించి..  ఆ బాలిక నోట్లో కుక్కి.. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. త‌న‌ లైంగిక వాంఛ తీర్చుకున్నారు. జ‌రిగిన‌ విషయం బయటపెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించాడు. ఇలా బెదిరించి ఆమెపై చాలా సార్లు కామవాంఛలు తీర్చుకున్నాడు. ఆ తర్వాత కూడా ఆ బాలిక‌పై   అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఆ 11 ఏళ్ల బాలిక గర్భం దాల్చింది.

బాధితురాలికి కడుపు నొప్పితో బాధ ప‌డుతుండ‌టంతో .. ఆ బాలిక‌ను వైద్య నిపుణుల వద్దకు తీసుకెళ్లగా బాలిక గర్భవతి అయిన‌ట్టు తేలింది. దీంతో బాధితురాలి కుటుంబీకులు పోలీసుల‌కు ఆశ్రయించారు. నిందిడిపై భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)376 (రేప్), 376 (2) (12 ఏళ్లలోపు మహిళపై అత్యాచారం చేయడం) సెక్షన్ల పాటు పోక్పో చ‌ట్టం కింద కూడా కేసు న‌మోదు చేసిన‌ట్టు కల్భోర్ పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. పోలీసులు నిందితుడిని  అరెస్టు చేసి, రిమాండ్ కు త‌రలించారు. 

PREV
click me!

Recommended Stories

Delhi Accident : ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్ భవనం... శిథిలాల కింద 50 మంది విద్యార్థులు ఉన్నారా?
నేపాల్ భయానక దృశ్యాలు | Nepal Visuals | Asianet News Telugu