భార్య ప్రసవానికి వెళ్లిన సమయంలో భర్త తల నరికి.. గుడి ముందు పెట్టిన దుండగులు..

Published : Feb 11, 2022, 10:34 AM IST
భార్య ప్రసవానికి వెళ్లిన సమయంలో భర్త తల నరికి.. గుడి ముందు పెట్టిన దుండగులు..

సారాంశం

కర్నాటకలోకి హోసూరులో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తిని అత్యంత కిరాతకంగా హతమార్చి... శరీరం నుండి తలను వేరుచేసి దేవుడి గుడిముందు పెట్టి వెళ్లారు నిందితులు. 

హోసూరు :  పెయింటర్ head chop చేసి మరియమ్మ ఆలయం వద్ద ఉంచిన ఘటన hosurలో కలకలం రేపింది. హోసూరు తాలూకా బాగలూరు సమీపంలోని ఎలువపల్లి గ్రామానికి చెందిన వెంకటేశప్ప కొడుకు ప్రదీప్ 25). ఇతనికి చంద్రిక అనే యువతితో పెళ్లి అయింది.  ఇద్దరు పిల్లలు ఉన్నారు. delivary కోసం భార్య పుట్టింటికి వెళ్ళింది.  ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు ప్రదీప్ తలను నరికి అదే ప్రాంతంలోని మరియమ్మ ఆలయం ముందు ఉంచి వెళ్లారు.

బాగలూరు పోలీసులు పరిశీలించగా దేహం కొంచెం దూరంలో కనిపించింది. ఎస్పీ సాయ్ చరణ్ తేజస్వి, హోసూరు డీఎస్సీ శివలింగం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అదే ప్రాంతానికి చెందిన బంధువులు సంతోష్, మురళితో ప్రదీప్ కు గత 15 యేళ్లుగా ఆస్తి తగాదాలున్నాయని, వారే హత్య చేసి ఉంటారని ప్రాథమిక విచారణలో తేలింది. నిందితులను తీవ్ర విచారణ జరుపుతున్నారు.

ఇలాంటి ఘటనే గత జనవరిలో తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలో కలకలం రేపింది. ఈ మొండెం లేని head కేసులో పోలీసులు పురోగతి సాధించారు. జనవరి 11న హతుడి వివరాలు కనుగొన్నారు. జనవరి 10 సోమవారం ఉదయం చింతపల్లి మండల పరిధిలో దారుణ హత్యకు గురైన వ్యక్తి వివరాలను పోలీసులు కనుగొన్నారు.

గొల్లపల్లి గ్రామంలోని విరాట్ నగర్ లో సాగర్ హైవే పక్కన గల mettu Mahankali అమ్మవారి పాదాల దగ్గర గుర్తు తెలియని వ్యక్తి తల భాగాన్ని.. గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్ళిన సంగతి రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటన నియోజకవర్గ వ్యాప్తంగా కలకలం రేపడంతో జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి ఆదేశాలతో దేవరకొండ డిఎస్పీ ఆనంద్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు అరు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేసి హతుడి వివరాలను  కనుగొన్నారు.

హతుడు సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం శూన్యంపాడు తండాకు చెందిన జయేందర్ నాయక్ (24) దిగా తండ్రి శంకర్ నాయక్ గుర్తించాడని పోలీసులు తెలిపారు. జయేందర్ నాయక్ మతిస్థిమితం కోల్పోయి గత 18 నెలలు క్రితం ఇంటి నుండి వెళ్లిపోయి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో భిక్షాటన చేసేవాడని తెలిపారు.

ఇంటి నుండి వెళ్లిపోయిన కుమారుడు 18 నెలల తర్వాత ఈరోజు ఇంత దారుణ హత్యకు గురయ్యాడని పోలీసుల ద్వారా తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తిని ఎవరు హత్య చేసివుంటారు? తల ఆలయంలో పెట్టిన హాంతకులు శరీర భాగాన్ని ఎక్కడ వదిలి వెళ్లారు?

అతనిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? మూఢనమ్మకాలతో ఎవరైనా నరబలి ఇవ్వడం కోసం ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

కాగా, నల్గొండ జిల్లాలోని చింతపల్లి మండలం గొల్లపల్లి గ్రామం విరాట్ నగర్ లో జనవరి 10న దారుణ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్-నాగార్జున సాగర్ రాష్ట్ర రహదారిపై ఉన్న మెట్టు మహంకాళి దేవాలయం దేవత కాళ్ళ విగ్రహం వద్ద వ్యక్తి మొండెం నుండి వేరు చేసిన తల ఉంది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ వక్తిని చంపి తలను దేవత కాళ్ళ వద్ద వదిలి వెళ్లారు. ఈ ఘటనతో గ్రామంలోని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

PREV
click me!

Recommended Stories

8th Pay Commission DA Hike: 63 శాతానికి డీఏ.. కేంద్రం అదిరిపోయే న్యూస్ ! జీతాలు ఎంత పెరుగుతాయంటే?
Sankranti Holiday Trip : కేవలం రూ.10000 బడ్జెట్ లో హాలిడే ట్రిప్.. చలికాలంలో తప్పకుండా చూడాల్సిన టాప్ 5 స్పాట్స్