
బెంగళూరుకు సంబంధించి ఇప్పటి వరకు మీరు చాలా వార్తలు విని ఉంటారు. ముఖ్యంగా బెంగళూరు ట్రాఫిక్ గురించి కూడా మీరు చాలా వార్తలు వినే ఉంటారు. అయితే, తాజాగా ఓ వ్యక్తి ఇలాంటి నగరంలో మధ్య తరగతి ప్రజలు బతకడం చాలా కష్టం అంటూ తన ఆవేదనను తెలియజేయడం విశేషం. తనకు ఎదురైన ఓ సంఘటనను ట్విట్టర్ వేదికగా పంచుకోగా, అది వైరల్ గా మారింది.
ఆటో డ్రైవర్లు ఎలా మోసం చేస్తున్నారు అనే విషయాన్ని అతను తెలియజేయగా, అది కాస్త వైరల్ గా మారింది. ఇంతకీ మ్యాటరేంటంటే, ఓ వ్యక్తి బెంగళూరులో ఓ ప్రదేశానికి వెళ్లడానికి ఓలా ఆటో బుక్ చేసుకున్నాడట. అయితే, ఆటో డ్రైవర్ మాత్రం తనను గమ్య స్థానానికి తీసుకువెళ్లలేదని చెప్పాడు. పైగా క్యాన్సిల్ చేసి, తనను ఎక్స్ ట్రా మనీ ఇవ్వమని అడిగాడు అని వాపోయాడు.
ప్రశాంత్ యాదవ్ అనే వ్యక్తి ఈ విషయాన్ని ట్విట్టర్ లో షేర్ చేయగా, అది వైరల్ గా మారింది. తనకు ఎదురైన అనుభవాన్ని అందులో పంచుకోగా, చాలా మంది దానికి కనెక్ట్ అవ్వడం విశేషం. తమకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైంది అని చాలా మంది చెప్పడం విశేషం.
తాను బెంగళూరు స్టేషన్‌కు ఎలా చేరుకున్నానో, తన గమ్యస్థానానికి చేరుకోవడానికి ఓలా ఆటోను ఎలా బుక్ చేసుకున్నానో యాదవ్ పంచుకున్నారు. డ్రైవర్ అంగీకరించాడు కానీ యాదవ్ పికప్ పాయింట్‌కు చేరుకోగానే రైడ్‌ను రద్దు చేయడం గమనార్హం. యాదవ్‌ను గమ్యస్థానానికి తీసుకెళ్లేందుకు డ్రైవర్ అదనపు డబ్బు అడిగాడని అతను వాపోయాడు.
“బెంగుళూరు సిటీ స్టేషన్‌లో దిగి, ఓలా ఆటో బుక్ చేసాను -> ఆటో వాలా నన్ను తన దగ్గరికి పిలిచాడు -> ఆటోను రద్దు చేసి, ఓలా ఫిర్ జౌంగాకు వెళ్లడానికి రూ. 100 ఎక్స్‌ట్రా ఇవ్వండి సార్ అన్నాడు. ప్రతి ఒక్కరినీ సంపన్న టెక్కీగా పరిగణించే మధ్యతరగతి వారు నగరంలో ఎలా జీవిస్తున్నారని నేను ఆశ్చర్యపోతున్నాను" అని క్యాప్షన్ లో పేర్కొనడం విశేషం. కాగా, పోస్ట్‌కి 58.9k వీక్షణలు , టన్నుల కొద్దీ స్పందనలు వచ్చాయి.