Muharram procession in Kashmir: 3 దశాబ్దాల తర్వాత కశ్మీర్ లోని లాల్ చౌక్ మీదుగా మొహర్రం ఊరేగింపు..

By Mahesh Rajamoni  |  First Published Jul 27, 2023, 11:15 AM IST

Muharram: శ్రీనగర్‌లోని గురుబజార్-దాల్గేట్ మార్గంలో షియా కమ్యూనిటీ మూడు దశాబ్దాల తర్వాత మొహర్రం ఊరేగింపును నిర్వహించింది. ఈ కార్యక్రమం శాంతియుతంగా ముగియడంతోపాటు ఇతర సమస్యలపై కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంలో పరిపాలనకు సహాయపడుతుందని ఒక అధికారి తెలిపారు. అలాగే, అన్ని భద్రతా ఏర్పాట్లు చేశామనీ, గురుబజార్ నుంచి బయటకు తీసుకెళ్లే ఊరేగింపు మినహా ఈ మార్గంలో వ్యక్తిగతంగా లేదా సామూహికంగా మరే ఇతర ఊరేగింపును చేపట్టరాదని సాధారణ ప్రజలకు, ముఖ్యంగా షియా కమ్యూనిటీ సభ్యులకు తెలియజేశారు.
 


Muharram-Procession taken out in Kashmir: జమ్ముకశ్మీర్ ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో శ్రీనగర్ లోని ముస్లిం కమ్యూనిటీ గురువారం మొహర్రం ఊరేగింపు నిర్వహించింది. రాష్ట్రంలో ఊరేగింపు సందర్భంగా ప్రజలు జెండాలు ఎగురవేస్తూ నినాదాలు చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత గురు బజార్ నుంచి లాల్ చౌక్ మీదుగా దాల్గేట్ వరకు సంప్రదాయ మార్గంలో మొహర్రం ఊరేగింపును నిర్వహించాలన్న ముస్లింల దీర్ఘకాలిక డిమాండ్ ను ప్రభుత్వం బుధవారం ఆమోదించింది.

Latest Videos

undefined

శ్రీనగర్‌లోని గురుబజార్-దాల్గేట్ మార్గంలో షియా కమ్యూనిటీ మూడు దశాబ్దాల తర్వాత మొహర్రం ఊరేగింపును నిర్వహించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమం శాంతియుతంగా ముగియడంతోపాటు ఇతర సమస్యలపై కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంలో పరిపాలనకు సహాయపడుతుందని ఒక అధికారి తెలిపారు. అలాగే, అన్ని భద్రతా ఏర్పాట్లు చేశామనీ, గురుబజార్ నుంచి బయటకు తీసుకెళ్లే ఊరేగింపు మినహా ఈ మార్గంలో వ్యక్తిగతంగా లేదా సామూహికంగా మరే ఇతర ఊరేగింపును చేపట్టరాదని సాధారణ ప్రజలకు, ముఖ్యంగా షియా కమ్యూనిటీ సభ్యులకు తెలియజేశారు.

మొహర్రం పదవ రోజును ఆషూరా అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఏ కొత్త పనిని ప్రారంభించకుండా నిరోధిస్తారు. పెళ్లిళ్లు వంటి కార్యక్రమాలు కూడా వాయిదా పడతాయి. ఈ నెల 28న ఆషూరా వస్తుంది.

 

(ఆవాజ్ ది వాయిస్ సౌజన్యంతో..)

click me!