అయ్యప్ప భక్తులు చంపేస్తారు: సుప్రీంను ఆశ్రయించిన ‘‘ఆ ఇద్దరు మహిళలు’’

By sivanagaprasad kodatiFirst Published Jan 17, 2019, 4:07 PM IST
Highlights

సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి శబరిమల ఆలయంలోకి ప్రవేశించి అయ్యప్పను దర్శించుకుని తరతరాల ఆనవాయితీకి చరమగీతం పాడారు బిందు, కనకదుర్గ. వీరిద్దరూ అయ్యప్పను దర్శించుకున్న తర్వాత కేరళలో పరిణామాలు వేగంగా మారిపోయాయి.

ఆలయ తంత్రి వెంటనే అయ్యప్ప ఆలయాన్ని మూసివేసి సంప్రోక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు. మహిళలు ఆలయ ప్రవేశం చేసినట్లు తెలుసుకున్న హిందూ సంఘాలు ఆగ్రహాంతో ఊగిపోయాయి. వారిద్దరిని చంపేస్తామని అయ్యప్ప భక్తులు ప్రకటించడంతో వారు కొన్ని రోజుల పాటు ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

చివరికి ఆజ్ఞాతాన్ని వీడి ఇంటికి వచ్చిన కనకదుర్గపై స్వయంగా అత్తగారు దాడి చేశారు. హిందూ సాంప్రదాయాలను మంటగలిపావంటూ చితకబాదింది. తలకు తీవ్ర గాయాలతో ప్రస్తుతం మలప్పురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది.

ఈ నేపథ్యంలో తమపై దాడులు ఆగే పరిస్థితి కనిపించడం లేదని, చంపేవరకు వదిలిపెట్టరని రక్షణ కల్పించాలని కోరుతూ బిందు, కనకదుర్గలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిని విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం రేపు విచారణ జరపనుంది. 
 
click me!