పక్కింటి వ్యక్తి దాడి: వివాహిత మృతి, వేడుక చూస్తూ వీడియో తీసిన స్థానికులు

sivanagaprasad kodati |  
Published : Jan 17, 2019, 03:29 PM IST
పక్కింటి వ్యక్తి దాడి: వివాహిత మృతి, వేడుక చూస్తూ వీడియో తీసిన స్థానికులు

సారాంశం

ఇరుగు పొరుగు అన్నాకా చిన్న చిన్న గొడవలు సహజం. ఇలా రెండు కుటుంబాల మధ్య వచ్చిన చిన్నగొడవ హత్యకు దారితీసింది. వివరాల్లోకి వెళితే.. దేశరాజధాని ఢిల్లీలోని ఖ్యాలా ప్రాంతంలోని డీడీఏ కాలనీకి చెందిన 40 ఏళ్ల మహ్మద్ ఆజాద్ అనే వ్యక్తి ఓ భవనంలో ఉంటున్నాడు. 

అదే భవనంలోని రెండో అంతస్తులో సునీత, ఆమె భర్త వీరు, 18 కుమారుడు ఆకాశ్‌తో ఉంటున్నారు. అయితే ఈ రెండు కుటుంబాల మధ్య కొద్దిరోజుల నుంచి చిన్న చిన్న తగదాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం సునీత సరుకులు కొనుక్కొని ఇంటికి తిరిగి వస్తుండగా ఆజాద్‌తో మరోసారి గొడవ జరిగింది.

ఈ విషయాన్ని సునీత తన భర్త, కుమారుడికి చెప్పగా వాళ్లు ఆజాద్‌తో ఘర్షణకు దిగారు. దీంతో కోపోద్రిక్తుడైన ఆజాద్ ఇంట్లోకి వెళ్లి పెద్ద కత్తితో బయటకు వచ్చాడు. అనంతరం సునీత, వీరు, ఆకాశ్‌లపై దాడి చేశాడు. సునీతను విచక్షాణారహితంగా పొడిచేసి పారిపోయాడు.

గాయపడిన ముగ్గురిని స్ధానికులు ఆస్పత్రికి తరలించగా... సునీత మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వీరూ, ఆకాశ్‌లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇంటి వద్ద అంతపెద్ద గొడవ జరుగుతుంటే, ఆజాద్‌ను అడ్డుకోకపోగా.. కొందరు సెల్‌ఫోన్లలో వీడియో తీశారు. అత్యంత కిరాతకమైన ఆ దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆజాద్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

PREV
click me!

Recommended Stories

Tamilnadu Incidnt : నిందితుడికి రెండు మరణశిక్షలు | Asianet News Telugu
Coimbatore Child Case: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే జోకులేంటి... సస్పెండ్ చేసిన సీఎం విజయ్