ఆంధ్రుడికి గుండె దానం చేసిన తమిళనాడు యువకుడు

By sivanagaprasad kodatiFirst Published Jan 17, 2019, 3:05 PM IST
Highlights

బ్రెయిన్ డెడ్‌కు గురైన ఓ యువకుడు తన అవయవాలను మరొకరికి దానం చేసి వారి ప్రాణాలను కాపాడాడు. వివరాల్లోకి వెళితే... తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లాకు చెందిన 30 ఏళ్ల యువకుడు బెంగళైరులోని ఓ ఆన్‌లైన్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 

ఈ క్రమంలో అతను ఈ నెల 12న రోడ్డు ప్రమాదానికి గురికావడంతో తల్లిదండ్రులు ఆ యువకుడిని బొమ్మసంద్రలోని స్పార్శ్ ఆసుపత్రిలో చేర్చారు. అతనికి చికిత్సనందిస్తున్న వైద్యులు బుధవారం సాయంత్రం 4.30 గంటలకు బ్రెయిన్ డెడ్ అయినట్లుగా ప్రకటించారు.

అనంతరం అవయవ దానం గురించి యువకుడి తల్లిదండ్రులను కోరారు. దీనికి వారు అంగీకరించడంతో యువకుడి గుండెను వేరొకరికి అమర్చేందుకు వైద్యులు అతని గుండెను సేకరించారు. అనంతరం బొమ్మసంద్ర నుంచి మత్తికెరేలోని ఎంఎస్ రామయ్య ఆసుపత్రికి అతని గుండెను తరలించారు.

ఈ శస్త్ర చికిత్సకు వీలుగా గురువారం పోలీసులు గ్రీన్ కారిడారు ఏర్పాటు చేశారు. దీంతో సుమారు 29.5 కిలోమీటర్ల దూరాన్ని 45 నిమిషాల్లోనే చేరుకుంది. అనంతరం 12.13 గంటలకు ఆపరేషన్‌‌ను ప్రారంభించి విజయవంతంగా గుండెను అమర్చారు.

కాగా, ఆ గుండెను పొందిన వ్యక్తిని ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా వాసిగా గుర్తించారు. ఇతను గత ఐదు నెలల నుంచి గుండెకు సంబంధించిన అనారోగ్యంతో  రామయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

click me!