మహిళలు చీకటి పడిన తర్వాత పోలీస్ స్టేషన్లకు వెళ్లొద్దు.. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు బేబీ రాణి మౌర్య

By team telugu  |  First Published Oct 24, 2021, 10:38 AM IST

ఉత్తరాఖండ్ మాజీ గవర్నర్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు బేబీ రాణి మౌర్య చేసిన వ్యాఖ్యలు వివాదానికి కేంద్ర  బిందువుగా మారాయి. మహిళలు చీకటి పడిన  తర్వాత  పోలీస్ స్టేషన్‌లకు (Police Stations) వెళ్లొద్దని, అత్యవసర పరిస్థితుల్లో వారితో పాటు కుటుంబంలోని పురుషులను తోడు తీసుకెళ్లాలని ఆమె అన్నారు.


ఉత్తరాఖండ్ మాజీ గవర్నర్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు బేబీ రాణి మౌర్య చేసిన వ్యాఖ్యలు వివాదానికి కేంద్ర  బిందువుగా మారాయి. మహిళలు చీకటి పడిన  తర్వాత  పోలీస్ స్టేషన్‌లకు (Police Stations) వెళ్లొద్దని, అత్యవసర పరిస్థితుల్లో వారితో పాటు కుటుంబంలోని పురుషులను తోడు తీసుకెళ్లాలని ఆమె అన్నారు. ఉత్తరప్రదేశ్ వారణాసిలోని బజర్‌డీహ ప్రాంతంలోని  వాల్మీకి బస్తీ‌లో జరిగిన  ఓ కార్యక్రమంలో బేబీ రాణి మౌర్య పాల్గొన్నారు. ఈ సందర్బంగా మహిళల బ‌ృందాన్ని ఉద్దేశించి Baby Rani Maurya  మాట్లాడుతూ.. ‘ఒక మహిళా అధికారి, ఒక సబ్-ఇన్స్ప్‌క్టర్ ఖచ్చితంగా పోలీస్ స్టేషన్‌లో ఉంటారు. అయితే సాయంత్రం 5 గంటల తర్వాత (చీకటి పడిన తర్వాత) పోలీస్ స్టేషన్‌కు వెళ్లవద్దని నేను సూచిస్తున్నాను. మరుసటి రోజు ఉదయం వెళ్లండి. అత్యవసరమైతే మీ సోదరుడిని గానీ, భర్తను గానీ,  తండ్రిని గానీ వెంట తీసుకెళ్లండి’అని అన్నారు.

బేబీ రాణి  మౌర్య చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన  వీడియోలు సోషల్ మీడియోలో  వైరల్‌గా మారడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఉత్తరప్రదేశ్‌లో పోలీసులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి వారు యోగి ఆదిత్యనాథ్  ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అయితే  ఇలాంటి తరుణంలో బేబి రాణి మౌర్య వ్యాఖ్యలతో ప్రతిపక్ష నేతలు యూపీ బీజేపీపై మాటల దాడిని మరింతగా పెంచారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. పోలీసులు నేరాలకు పాల్పడుతున్నందున యూపీ ప్రజలకు పోలీస్ స్టేషన్‌లలో కూడా భద్రత లేదని అన్నారు.

Latest Videos

undefined

Akhilesh Yadav యూపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళల భద్రతకు సంబంధించి అనేక వినూత్న ప్రయోగాలు జరిగాయని సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు వాజిద్ నిసార్ అన్నారు. 1090 మహిళా హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయబడిందని.. దీని ద్వారా మహిళలు తమ ఫిర్యాదులను కేవలం ఒక ఫోన్ కాల్ ద్వారా నమోదు చేసే అవకాశం కల్పించడం  జరిగిందన్నారు. ‘అఖిలేష్ యాదవ్ ఆధ్వర్యంలో మహిళలు స్టేట్‌మెంట్ నమోదు చేయడానికి పోలీసు స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. మహిళల భద్రత పట్ల పోలీసు యంత్రాంగం అప్రమత్తతో ఉంది. కానీ ఇప్పుడు పోలీసులు పూర్తిగా నిరంకుశంగా మారారు. ర పోలీసు స్టేషన్‌లలో హత్యలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పురుషులే పోలీసు స్టేషన్లకు వెళ్లేటప్పుడు సురక్షితంగా భావించరు. మరి మహిళలు సురక్షితంగా ఎలా భావిస్తారు?’ అని వాజిద్ నిసార్ పేర్కొన్నారు. 

Also read: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఊహించని షాక్.. అక్టోబరు జీతాల్లో కోత..!

ఇక, ప్రతిపక్షాలు, నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో బేబీ రాణి మౌర్య స్పందించారు. ఉత్తరప్రదేశ్‌లో మహిళల భద్రతపై తాను చేసిన వ్యాఖ్యలను సందర్భానుసారంగా వక్రీకరించారని ప్రతిపక్ష నేతలపై ఆమె మండిపడ్డారు. ‘మహిళలకు సత్వర న్యాయం జరిగే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నాయని  కూడా నేను చెప్పాను. ప్రధాని  నరేంద్ర  మోదీ, యోగి ఆదిత్యనాథ్ నేత‌ృత్వంలోని ప్రభుత్వం మహిళల భద్రత కోసం నిరంతరం పనిచేస్తున్నాయి. ప్రతిపక్షాలు నా వ్యాఖ్యలను  వక్రీకరించాయి‘అని ఆమె పేర్కొన్నారు.

click me!