వైరల్ వీడియో : జిమ్ లో కొట్టుకున్న యువతులు..!

Published : Oct 12, 2022, 10:41 AM ISTUpdated : Oct 12, 2022, 10:57 AM IST
 వైరల్ వీడియో : జిమ్ లో కొట్టుకున్న యువతులు..!

సారాంశం

బ్లాక్ షర్ట్ ధరించిన మహిళ వెళ్లగా... వెనక నుంచి మరో మహిళ వచ్చి ఆక్రమించుకుంది. అంతే.. ఇద్దరూ నేనంటే నేను అంటూ ఒకరినొకరు కొట్టుకోవడం గమనార్హం.

శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవడానికి మనమంతా జిమ్ కి వెళుతూ ఉంటాం. ఇది చాలా సర్వ సాధారణం. అయితే... అలా ఫిట్నెస్ కోసం జిమ్ కి వెళ్లిన ఇద్దరు యువతులు అక్కడ ఎక్విప్మెంట్ కోసం కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. విపరీతంగా కొట్టుకోవడం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళితే...స్మిత మెషీన్ వద్ద ఓ మహిళ వ్యాయామం చేస్తూ ఉంది. ఆమె వెళ్లిన తర్వాత చేయాలని బ్లాక్  షర్ట్ ధరించిన ఓ మహిళ ఎదురుచూస్తూ ఉంది. ఆమె వెళ్లగానే.. బ్లాక్ షర్ట్ ధరించిన మహిళ వెళ్లగా... వెనక నుంచి మరో మహిళ వచ్చి ఆక్రమించుకుంది. అంతే.. ఇద్దరూ నేనంటే నేను అంటూ ఒకరినొకరు కొట్టుకోవడం గమనార్హం.

 

ఇద్దరూ ఒకరి  జుట్టు ఒకరు పట్టుకొని కొట్టుకున్నారు. వారి గొడవ తీర్చడానికి పక్కన ఉన్నవారు చాలానే ప్రయత్నించారు. వాళ్లు మాత్రం ఆగకుండా కొట్టుకుంటూనే ఉన్నారు. ఆతర్వాత.. వారిద్దరినీ వేరు చేయడంతో.. సమస్య సద్దుమణిగింది. అయితే... ఈ సంఘటన ఎక్కడ జరిగింది అనేది మాత్రం క్లారిటీ లేదు.

కాగా... ఈ వీడియో పై నెటిజన్ల కామెంట్లు విపరీతంగా నవ్విస్తూన్నాయి. వ్యాయామం చేయకపోయినా... కొట్టుకోవడం వల్ల.. వారి శరీరంలో క్యాలరీలు కరిగాయంటూ కొందరు కామెంట్ చేయడం గమనార్హం.

PREV
click me!

Recommended Stories

Indian Population in USA: అమెరికాలో ఇండియన్స్ అడ్డా.. ఈ 5 నగరాల్లోనే ఎక్కువ మంది.. ఎందుకో తెలుసా?
చెన్నై లో నూతన భవనాలను ప్రారంభించిన సీఎం విజయ్ | CM C. Joseph Vijay Visits Perambur