
దాదాపు నాలుగు దశాబ్దాల నాటి భోపాల్ గ్యాస్ లీక్ దుర్ఘటన మళ్లీ తెర మీదకి వచ్చింది. 1984 భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితులకు మరింత మెరుగైన పరిహారం అందజేస్తామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. అమెరికాకు చెందిన యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ యాజమాన్యంలోని కంపెనీల నుంచి రూ.7,844 కోట్ల అదనపు పరిహారం చెల్లించాలని కోరుతూ క్యూరేటివ్ పిటిషన్‌ను దాఖలు చేయనున్నట్లు ప్రభుత్వం మంగళవారం తెలిపింది.
ఈ విషయంపై దాఖలైన కేసును జస్టిస్ ఎస్.కె.కౌల్ ఆధ్వర్యంలోని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎ.ఎ్‌స.ఓకా, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ జె.కె.మహేశ్వరిలతో కూడిన అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతోంది. ప్రభుత్వం బాధితులకు (భోపాల్ గ్యాస్ దుర్ఘటన) ప్రాతినిధ్యం వహించాలని అటార్నీ జనరల్ కార్యాలయం ఒక సంకలనాన్ని సిద్ధం చేస్తుందని అని బెంచ్ పేర్కొంది.
దరఖాస్తుదారుల సంఘాలకు సంబంధించినంతవరకు, తాము దరఖాస్తులను దాఖలు చేయడానికి స్వేచ్ఛను ఇవ్వమని, ఈ కేసు తదుపరి విచారణ 2023 జనవరి 10న రానుందని తెలిపింది. ఈ విషయం ప్రతిరోజూ తెరపైకి వస్తుందనీ. అలాగని బాధితులను వదిలిపెట్టలేమని తెలిపింది.
న్యాయవాదులు సంజయ్ పారిఖ్, కరుణ నుండీ మాట్లాడుతూ తీర్పు వెలువడే ముందు గ్యాస్ లీక్ బాధితుల వాదనలు వినిపించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం ఈ అంశాన్ని కొనసాగించాలని భావిస్తున్నదని, ఘటనకు సంబంధించిన సమాచారాన్ని క్రోడీకరించిన తర్వాత కోర్టుకు నోట్‌ను సమర్పిస్తామని వెంకటరమణి తెలిపారు. బాధితులకు సివిల్ నష్టపరిహారం మాత్రమే కాకుండా.. కంపెనీ యొక్క నేరపూరిత పాత్రపై దర్యాప్తు జరగాలని నండి అన్నారు.
ఈ విషయంలో యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ తరపు న్యాయవాది ప్రభుత్వేతర సంస్థల స్థానాన్ని ప్రశ్నించారు. న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, ఎఎస్ ఓకా, విక్రమ్ నాథ్ మరియు జెకె మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం 19 సంవత్సరాల విరామం తర్వాత క్యూరేటివ్ పిటిషన్‌ను దాఖలు చేసినట్లు తెలిపింది.
భోపాల్ గ్యాస్ దుర్ఘటన
డిసెంబర్ 3, 1984 తెల్లవారుజామున భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ ఇండియా ప్లాన్ నుండి మిథైల్ ఐసోసైనేట్ (MIC) అనే అత్యంత విషపూరిత వాయువు లీక్ అయ్యింది. ఈ దుర్ఘటనలో 3,000 మందికి పైగా మరణించారు. 1.02 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. 1989 సెటిల్‌మెంట్ సమయంలో రూ. 715 కోట్ల పరిహారం చెల్లించింది.
కేసు విచారణ తర్వాత, గ్యాస్ లీక్ నుండి ప్రాణాలతో బయటపడినవారికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఐదు సంస్థల నాయకులు అదనపు పరిహారం కోసం క్యూరేటివ్ పిటిషన్‌ను కొనసాగించడానికి ప్రభుత్వం యొక్క నిబద్ధతపై సంతృప్తిని వ్యక్తం చేశారు. అంతకుముందు, అదనపు పరిహారం కోరుతూ క్యూరేటివ్ పిటిషన్‌ను దాఖలు చేయాలనుకుంటున్నారా లేదా అని తన స్టాండ్‌ను స్పష్టం చేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది. విషవాయువు లీకేజీ వల్ల సంభవించిన వ్యాధులకు సరైన చికిత్స, తగిన పరిహారం కోసం ఈ దుర్ఘటన బాధితులు సుదీర్ఘ న్యాయ పోరాటం చేస్తున్నారు.