మహిళా డ్యాన్సర్‌తో అసభ్యంగా ప్రవర్తించే ప్రయత్నం.. ఆమె గుణపాఠం ఎలా చెప్పిందంటే? (వీడియో)

Published : Jan 14, 2023, 07:39 PM IST
మహిళా డ్యాన్సర్‌తో అసభ్యంగా ప్రవర్తించే ప్రయత్నం.. ఆమె గుణపాఠం ఎలా చెప్పిందంటే? (వీడియో)

సారాంశం

స్టేజీపై డ్యాన్స్ చేస్తున్న మహిళ వద్దకు ఓ వ్యక్తి వచ్చాడు. ఆమె ఆటను ఆటంకపరిచే ప్రయత్నం చేశాడు. దీంతో ఆమె ఆ వ్యక్తిని వెనుక నుంచి పట్టుకుని గాల్లోకి లేపి గుండ్రంగా తింపింది. కొన్ని రౌండ్లు తింపేసి అతడిని కిందికి దింపేశాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్నది.  

న్యూఢిల్లీ: సాధారణంగా మహిళలు డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌లు చేస్తూ ఉంటే కొందరు పురుషులు అడ్వాన్స్ అవుతూ ఉండటం చాలా సార్లూ చూస్తూ ఉంటాం. కొందరు అసభ్యకర కామెంట్లు చేస్తుంటే కొందరైతే ఏకంగా మహిళలు డ్యాన్స్ చేస్తున్న వేదికపైకి ఎక్కేస్తారు. అంతటితో ఆగరు వారిని అభ్యంతరకర రీతిలో తాకే ప్రయత్నం చేస్తూ ఉంటారు. చాలా సార్లు ఆ మహిళలు బెంబేలెత్తిపోతారు. హడలిపోయి దూరం జరుగుతారు. కానీ, సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో మాత్రం ఆ మహిళా డ్యాన్సర్‌ అలాంటి ఓ వ్యక్తికి సరైన గుణపాఠం చెప్పింది.

ఆ వీడియోలో ఓ మహిళ డ్యాన్స్ చేస్తూ కనిపించింది. కొందరు పురుషులు ఆమెను ఆటపట్టించడానికి లేదా డిస్టర్బ్ చేయడానికి, లేదా ఆమెతో అసభ్యకరంగా బిహేవ్ చేయడానికి స్టేజీ ఎక్కారు. ఆమె డ్యాన్స్ చేస్తుంటే మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నారు. దీంతో ఆమె అందులో నుంచి ఓ వ్యక్తి వద్దకు నేరుగా వెళ్లింది. ఆ వ్యక్తిని వెనుక నుంచి భుజాల వద్ద పట్టుకుని గాల్లోకి లేపింది. కొన్ని రౌండ్లు గుండ్రంగా తిరిగింది. ఆ తర్వాత అతడిని కిందకు దింపింది. ఆ వ్యక్తి తల తిరిగిపోయింది. నిలబడలేకపోయాడు. కానీ, ఆమె మాత్రం తిరిగి వెళ్లి మళ్లీ డ్యాన్స్ చేయడంలో లీనమైంది. ఆ వ్యక్తి పరిస్థితి మాత్రం దారుణంగా మారిపోయింది.

Also Read: తాను నడిపే విమానంలో... తల్లి, కొడుకు... ఆనందంలో పైలెట్...!

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ వీడియోపై భిన్నమైన కామెంట్లు వస్తున్నాయి.

PREV
click me!

Recommended Stories

Independence Day 2026 : ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు... ఎర్రకోట సాక్షిగా యువతపై వరాలు కురిపించిన ప్రధాని
80వ స్వాతంత్ర దినోత్సవం రాష్ట్రపతి ముర్ము సందేశం | Droupadi Murmu Independence Day speech