మంచినీటి కోసం 60 అడుగుల లోతు బావిలోకి దిగిన మహిళ

Published : Apr 25, 2019, 01:30 PM IST
మంచినీటి కోసం  60 అడుగుల లోతు బావిలోకి దిగిన మహిళ

సారాంశం

 మంచినీటి కోసం ఓ మహిళ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని  60 ఫీట్ల అడుగుల లోతు బావిలోకి వెళ్లింది. తమ కుటుంబసభ్యుల దాహం తీరాలంటే ప్రతి రోజూ 60 అడుగుల లోతున్న బావిలోకి దిగి నీటిని తీసుకురావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.


ముంబై: మంచినీటి కోసం ఓ మహిళ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని  60 ఫీట్ల అడుగుల లోతు బావిలోకి వెళ్లింది. తమ కుటుంబసభ్యుల దాహం తీరాలంటే ప్రతి రోజూ 60 అడుగుల లోతున్న బావిలోకి దిగి నీటిని తీసుకురావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

మహారాష్ట్రలోని  నాసిక్ తీవ్రమైన కరువు పరిస్థితుల నేపథ్యంలో భూగర్భజలాలు అడుగంటిపోయాయి. దీంతో  ప్రతి రోజూ 60 అడుగుల లోతున్న బావిలో నీటి కోసం సర్కస్ ఫీట్లు చేయాల్సిన  పరిస్థితులు నెలకొన్నాయి.

మహారాష్ట్రలోని  నాసిక్‌కు సమీపంలోని బర్దివాడిలో ఈ బావి నుండే మహిళలు నీటిని తీసుకెళ్తున్నారు.  ఈ బావిలోకి దిగకపోతే గొంతు తడవని  పరిస్థితులు నెలకొంటాయని స్థానికులు చెబుతున్నారు.
 

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?