మాతృభాషా పరిరక్షణకు యువకుడి సైకిల్ యాత్ర

By telugu teamFirst Published Apr 25, 2019, 12:23 PM IST
Highlights

మారుతున్న టెక్నాలజీకి తగిన విధంగా మానం మారాలంటూ.. ప్రస్తుతం అందరూ మాతృభాషను వదిలేసి.. ఆంగ్ల బాషపై మక్కువ పెంచుకుంటున్నారు. 

మారుతున్న టెక్నాలజీకి తగిన విధంగా మానం మారాలంటూ.. ప్రస్తుతం అందరూ మాతృభాషను వదిలేసి.. ఆంగ్ల బాషపై మక్కువ పెంచుకుంటున్నారు. స్కూల్లో ఇంగ్లీష్ మాట్లాడటంతోపాటు.. ఇంట్లోనూ పిల్లలతో అదే భాషలో మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో పిల్లలు తమ మాతృభాషను మర్చిపోతున్నారు. 

అందుకే మాతృభాషను రక్షించుకునేందుకు ఓ యువకుడు సైకిల్ యాత్ర చేపట్టాడు. బతుకు తెరువు కోసం ఎన్ని భాషలు నేర్చినా.. మాతృభాషను మరవకూడదు అనేది అతని అభిప్రాయం. మహారాష్ట్రలోని డోంబివలికి చెందిన గంధార్‌ పుణే విశ్వవిద్యాలయంలో ఎంఏ (సంస్కృతం) పూర్తి చేశారు. బతకడానికి ఇతర భాషలు అవసరమైనా.. మాతృభాషను మరవకూడదనే ఉద్దేశాన్ని ప్రజలకు వివరించేందుకు సైకిల్‌ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. 

జులై 1, 2018న ముంబయి నుంచి ప్రారంభమైన యాత్ర ఈ ఏడాది ఆగస్టు 15తో ముగుస్తుందన్నారు. 20 వేల కిలోమీటర్ల లక్ష్యంతో చేపట్టిన యాత్ర 11,650 పూర్తయిందని వివరించారు. ఉత్తర భారతదేశంలో యాత్ర పూర్తయిందని చెప్పాడు.  రోజు 80 నుంచి 120 కిలోమీటర్లు మూరుమూల గ్రామాలు, పల్లెల మీదుగా యాత్ర సాగుతుందని.. విద్యార్థులు, ప్రజలతో మాతృభాష గురించి వివరిస్తున్నట్లు అతను తెలిపాడు. 

Gandhar Kulkarni: I started on 1st July 2018 & intend to complete on 15 August this yr. I'm undertaking this to create an awareness about one's mother tongue & emphasise this in school education. One must read all languages but they should learn their mother tongue first. (24.04) pic.twitter.com/jLOpQQJ0M9

— ANI (@ANI)

 

click me!