టూత్ పేస్ట్ ట్యూబ్ ని ఇలా కూడా వాడతారా..?

Published : Jul 13, 2023, 12:30 PM ISTUpdated : Jul 13, 2023, 12:31 PM IST
టూత్ పేస్ట్ ట్యూబ్ ని ఇలా కూడా వాడతారా..?

సారాంశం

నీరు సన్నగా, ఓ చిన్న ద్వారంలా వస్తున్నాయి. అవసరం అయిపోగానే, ఆమె టూత్ పేస్ట్ క్యాప్ పెడుతోంది. దానిని ఆమె షేర్ చేయగా, అది కాస్త వైరల్ గా మారింది.

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత మనం చాలా వింతలు చూస్తున్నాం. అంతేకాదు, సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు ప్రజలు కూడా వింత వింత ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఓ మహిళ కూడా అలాంటి వింత ప్రయత్నమే చేసింది. టూత్ పేస్ట్ డబ్బాతో వాటర్ ట్యాప్ కి కనెక్ట్ చేసింది. దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది కాస్త వైరల్ గా మారింది.

నిజానికి ఎవరైనా పేస్ట్ అయిపోగానే, ఆ టూత్ పేస్ట్ ట్యూబ్ ని పక్కకు పడేస్తారు. కానీ, ఓ మహిళ మాత్రం దానిని వాటర్ పైప్ కి ఫిక్స్ చేసింది. నీరు అవసరం అయినప్పుడు టూత్ పేస్ట్ క్యాప్ ఓపెన్ చేస్తోంది. నీరు సన్నగా, ఓ చిన్న ద్వారంలా వస్తున్నాయి. అవసరం అయిపోగానే, ఆమె టూత్ పేస్ట్ క్యాప్ పెడుతోంది. దానిని ఆమె షేర్ చేయగా, అది కాస్త వైరల్ గా మారింది.

ఆమె తెలివికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇలా కూడా నీటిని వృథా చేయకుండా కాపాడుతోంది అంటూ ఆమెను మెచ్చుకుంటున్నారు. ఖాళీ టూత్ పేస్ట్ ట్యూబ్ ని ఇలా కూడా వాడొచ్చని మాకు తెలీదు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా ఈ వీడియో పై ఓ లుక్ వేయండి. 

 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?