లైంగికంగా వేధించబోయాడు.. అపరకాళిలా మారి..!

Published : Sep 30, 2021, 08:48 AM IST
లైంగికంగా వేధించబోయాడు.. అపరకాళిలా మారి..!

సారాంశం

ఆ సమయంలో నిందితుడు బాగా తాగి ఉన్నాడు. మహిళను ఢీకొట్టడమేకాక ఆమెతో గొడవపడ్డాడు. అనంతరం ఆమెను లైంగికంగా వేధించసాగాడు. సదరు మహిళ ఎన్నిసార్లు హెచ్చరించినా ఆ మూర్ఖుడు తన బుద్ధి మార్చుకోలేదు.   

ఓ తాగుబోతు మద్యం మత్తులో ఓ యువతిని చెరపట్టాలని చూశాడు. ఆమెను లైంగికంగా వేధించబోయాడు. అయితే.. అతను చేస్తున్న పనికి ఆ యువతి లొంగిపోలేదు. అపరకాళిలా మారి.. అతనిపై పోరాడింది.  చెప్పుతీసుకొని కొట్టి బుద్ది వచ్చేలా చేసింది. అక్కడితో ఊరుకోలేదు.. అందరి ముందు క్షమాపణలు చెప్పించింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మధ్యప్రదేశ్‌ రాజ్‌గఢ్‌ ప్రాంతానికి చెందిన సదరు మహిళ చాపిహేరా ప్రాంతంలో బ్యూటీపార్లర్‌ నడుపుతుంది. ఈ క్రమంలో ఆమె రెండు రోజుల క్రితం సాయంత్రం ఇంటికి వెళ్తుండగా రోడ్డు మీద ఓ వ్యక్తి ఆమెను ఢీకొన్నాడు. ఆ సమయంలో నిందితుడు బాగా తాగి ఉన్నాడు. మహిళను ఢీకొట్టడమేకాక ఆమెతో గొడవపడ్డాడు. అనంతరం ఆమెను లైంగికంగా వేధించసాగాడు. సదరు మహిళ ఎన్నిసార్లు హెచ్చరించినా ఆ మూర్ఖుడు తన బుద్ధి మార్చుకోలేదు. 


ఓపిక నశించిన సదరు మహిళ బస్టాండ్‌ సమీపంలో.. నడి రోడ్డు మీద ఆ మృగాడిని చెప్పు తీసుకొని కొట్టింది. మత్తు దిగేదాకా చెప్పు దెబ్బలు కొడుతూనే ఉంది. స్పృహ వచ్చి.. పారిపోదామాని భావించిన నిందితుడిను అలాగే పట్టుకుని.. తనకు క్షమాపణ చెప్పేవరకు వదిలిపెట్టలేదు. నిందితుడు కింద కూర్చొని.. దండం పెడితే కానీ అతడిని వదలలేదు. 


చివరగా.. నన్ను తక్కువ అంచాన వేశావ్‌.. నీలాంటి నీచులకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. ఇంకోసారి కనిపించావో నా చేతుల్లో చచ్చావే అని హెచ్చరించి మరి వదిలిపెట్టింది. ఇక సదరు మహిళ మృగాడిని కొడుతున్న సమయంలో చాలా మంది గుమికూడారు. ఆమె చేస్తున్న పనిని ప్రశంసించారు. 

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్