అక్రమ సంబంధం పెట్టుకున్నారని.. నగ్నంగా ఊరేగించి..!

Published : Sep 30, 2021, 07:43 AM ISTUpdated : Sep 30, 2021, 07:48 AM IST
అక్రమ సంబంధం పెట్టుకున్నారని.. నగ్నంగా ఊరేగించి..!

సారాంశం

 సదరు యువకుడు మంగళవారం ఆ మహిళ ఇంటికి వెళ్లడాన్ని గమనించిన స్థానికులు అతడిని పట్టుకొని బంధించారు. అనంతరం వారిద్దరినీ నగ్నంగా ఊరేగించారు. 


అక్రమ సంబంధం పెట్టుకున్నారని ఓ మహిళ, పురుషుడికి  గ్రామస్థులు అతి పెద్ద శిక్ష వేశారు. నగ్నంగా గ్రామంలో ఊరేగించారు. ఈ సంఘటన జార్ఖండ్ లోని డుంకా జిల్లాలో  చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. డుంకా జిల్లా బడ్తల్లి పంచాయతీ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఓ వివాహిత కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.

ఓ నేరం కేసులో ఆమె భర్త ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది. సదరు యువకుడు మంగళవారం ఆ మహిళ ఇంటికి వెళ్లడాన్ని గమనించిన స్థానికులు అతడిని పట్టుకొని బంధించారు. అనంతరం వారిద్దరినీ నగ్నంగా ఊరేగించారు. దాదాపు కిలోమీటరు మేర గ్రామం మొత్తం ఊరేగించారు. కాగా ఈ విషయం పోలీసులకు ఆలస్యంగా తెలిసింది. దీంతో.. వారు రంగంలోకి దిగి.. ఈ ఘటనకు పాల్పడిన దాదాపు 60 మందిపై కేసు నమోదు చేశారు. 

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్