
శ్రీనగర్: Jammu kashmir లోని Kulgam జిల్లాలో ఓ స్కూల్ టీTeacher ను Terrorist మంగళవారం నాడు ఉదయం కాల్చి చంపారు. జమ్మూ ప్రాంతంలోని Sambaకు చెందిన 36 ఏళ్ల రజనీ బాలా టీచర్ గా పనిచేస్తున్నారు. కుల్గాం జిల్లాలోని గోపాల్ పోరా ప్రాంతంలో ఆమె ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తుంది. ఒవాళ ఉదయం రజనీ బాలాపై ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రజనీ బాలా మరణించారు. ఈ దారుణానికి పాల్పడిన ఉగ్రవాదులను గుర్తించి పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
Gopalpora ప్రాంతంలోని హై స్కూల్ లో ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రాంతాన్ని పోలీసులు పరిశీలించారు. ఇటీవలనే సెంట్రల్ కాశ్మీర్ లోని బుధామ్ జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగి రాహుల్ భట్ ను అతని కార్యాలయంలోనే ఉగ్రవాదులు కాల్చి చంపారు. దీంతో ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. మూడు వారాల క్రితం చాదురా పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలోనే ఈ ఘటన చోటు చేసుకొంది.
రాహుల్ భట్ 2010-11 వలసదారుల ప్యాకేజీ కింద రాహుల్ భట్ క్లర్క్ ఉద్యోగం పొందాడు. వారం రోజుల క్రితం బుధామ్ జిల్లాలో 35 ఏళ్ల అమ్రీన్ భటన్ ను వారం రోజుల క్రితం టెర్రరిస్టులు కాల్చి చంపారు. ఈ దాడిలో మహిళ మేనల్లుడు 10 ఏళ్ల బాలుడు కూడా గాయపడ్డారు. లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారని తెలిపారు.ఈ నెలలో కాశ్మీర్ లో ఏడుగురిని టెర్రరిస్టులు హత్య చేశారు. బాధితుల్లో ముగ్గురు డ్యూటీలో లేని పోలీసులు కాగా, మరో నలుగురు పౌరులు కూడా ఉన్నారు.