Meerut: బరాత్ లో అలా చేయ‌డంతో.. వధూవరులపై కేసు.. ఏం జ‌రిగిందంటే ?

Published : May 31, 2022, 12:01 PM IST
Meerut: బరాత్ లో అలా చేయ‌డంతో.. వధూవరులపై కేసు.. ఏం జ‌రిగిందంటే ?

సారాంశం

Meerut: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో జ‌రిగిన పెళ్లి బ‌రాత్ లో ఊహించని ఘ‌ట‌న జ‌రిగింది. వధూవరులు ఓపెన్ కారులో కూర్చొని.. త‌మ పెళ్లి వేడుక‌లు ఎప్ప‌టికీ గుర్తుండిపోయేలా కాల్పులు జరిపారు. ఈ చర్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీసులు వారిద్దరిపై కేసు నమోదు చేశారు. ఆ జంట కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఏ ఆయుధంతో కాల్పులు జరిపారో కూడా ఆరా తీస్తారు.    

Meerut:  ఇటీవల కాలంలో పెళ్లి సంద‌డి ట్రెండ్ చాలా మారింది. త‌మ పెళ్లి తంతూను ఎల్లకాలం గుర్తుండిపోయేలా.. నూత‌నంగా ప్ర‌యత్నిస్తున్నారు. ఇందుకోసం ప్ర‌త్యేక ఏర్పాటు చేస్తుంటారు. ఆట‌లు, పాటలు, డ్యాన్స్ లు, బ‌రాత్ లు ఇలా ఎన్నో వినోద కార్య‌క్ర‌మాల‌ను ఏర్పాటు చేసి.. పెళ్లికి వ‌చ్చిన వారిని ఆకట్టుకునే ప్ర‌యత్నం చేస్తారు. త‌మ పెళ్లి వేడుక‌ను వైభ‌వ వేడుక‌గా మార్చుకుంటున్నారు. ఈ త‌రుణంలో ఓ నూత‌న జంట‌ త‌మ పెళ్లి వేడుక‌లు కూడా ఎప్ప‌టికీ గుర్తుండిపోవాల‌ని ఓ ప‌ని చేసింది.. ఆ ప‌నే వారిని చిక్కులో ప‌డేసింది. చివ‌రికి  జైలు పాలయ్యేలా చేసింది. మొత్తం వ్యవహారం మీరట్‌లోని మవానా పోలీస్ స్టేషన్ పరిధిలో జ‌రిగింది. 
 
వివరాల్లోకెళ్తే.. మే 26 న‌ మీరట్‌లోని మవానా ప్రాంతానికి చెందిన ఓ పెళ్లి బ‌రాత్ లో ఎవ్వ‌రూ ఊహించ‌ని ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఓపెన్ కారులో కూర్చున్న వధువును చూపించేందుకు వరుడు వధువు చేతిని  పట్టుకుని గాలిలో కాల్పులు జ‌రిపాడు. ఇలా ఒకటి తర్వాత ఒకటి ఇలా 4 రౌండ్లు కాల్పులు జ‌రిపారు. అయితే.. వధూవరుల ఈ చర్యకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై  ఆయుధాల చట్టాన్ని ఉల్లంఘించార‌నే ఆరోప‌ణ‌ల‌తో మీరట్‌లోని మవానా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ తర్వాత ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

వైర‌ల్ గా మారిన‌ వీడియోలో.. కారులో కూర్చున్న వధూవరులు కలిసి పిస్టల్‌తో కాల్పులు జ‌రిపిన‌ట్టు స్ప‌ష్ట‌మైతోంది. నగరంలోని ఓ పేరెన్నికగన్న కుటుంబానికి చెందిన అమ్మాయి పెళ్లికి సంబంధించిన బ‌రాత్ గా తెలుస్తోంది. మొత్తం వ్యవహారం మీరట్‌లోని మవానా పోలీస్ స్టేషన్ పరిధిలో జ‌రిగింది.

వీడియో వైరల్‌

వధూవరుల జ‌రిగిన కాల్పుల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో మీరట్ ఎస్పీ, కేశవ్ కుమార్ దృష్టికి వెళ్ల‌డంతో పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. పోలీసులు ఇద్దరి కోసం వెతుకుతున్నారు. కాల్పులు జరిపిన ఆయుధంపై కూడా దర్యాప్తు జరుగుతుంది. ఈ విషయమై ఎస్పీ దేహత్ కేశవ్ కుమార్ మాట్లాడుతూ.. మాకు వీడియో లభించిందని చెప్పారు. వారిపై కేసు నమోదు చేశామని, కేసు దర్యాప్తు చేస్తున్నామ‌ని తెలిపారు. వారు ఉపయోగించి రివాల్వ‌ర్ కు లైసెన్స్ ఉందా?  లేదా అనే కోణంలో కూడా ద‌ర్యాప్తు సాగుతోంద‌ని  తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Indigo కు షాక్: 10 శాతం విమానాలు రద్దు.. రంగంలోకి ప్రత్యేక టీమ్ తో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. పెంచుతుంది : యోగి ఆసక్తికర కామెంట్స్