చెన్నైలో పడవలపై జాలర్ల నిరసన.. డిమాండ్లు అవే...

Published : May 31, 2022, 12:08 PM IST
చెన్నైలో పడవలపై జాలర్ల నిరసన.. డిమాండ్లు అవే...

సారాంశం

తమిళనాడులో జాలర్లు నిరసనకు దిగారు. థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి నీరు బైటికి రాకుండా ఇసుక బస్తాలు అడ్డువేసి నిరసన చేశారు. 

చెన్నై : Job opportunities కల్పించాలన్న డిమాండ్ తో తిరువొత్తియూరుకు చెందిన జాలర్లు పడవలపై వెళ్లి నిరసన తెలిపిన సంఘటన సోమవారం అత్తిపట్టులో కలకలం రేపింది.  Chennai అత్తిపట్టులోని ఉత్తర చెన్నై Thermal power station కోసం వినియోగించిన అనంతరం వృధా జలాల్ని ఎన్నూరు వద్ద సముద్రంలో వదులుతున్నందున Fish, shrimp ఉత్పత్తి పూర్తిగా స్తంభించి పోతుంది అని స్థానిక జాలర్ల వాపోతున్నారు. ఆ వృధా జలాలు అధిక వేడిగా, రసాయనాలు మిళితమై ఉండటంతో జలచరాలు అంతరించిపోతున్నాయి. అందువల్ల ఆ నీటి విడుదలను అడ్డుకోవాలని కోరుతూ పలుమార్లు  జిల్లా  యంత్రాంగం, ప్రభుత్వానికి విన్నవించుకున్నా ఎలాంటి చర్యలు లేకుండా పోయాయి. 

అందువల్ల తీవ్రంగా నష్టపోతున్న ఎన్నూర్ పరిధిలోని తాళంకుప్పం, nettukuppam, కాట్టుకుప్పం, ఎన్నూర్ కుప్పం సహా ఎనిమిది గ్రామాలకు చెందిన జాలర్లకు ఆ ధర్మల్ విద్యుత్ కేంద్రంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని గతంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించారు. దీంతో ఆ విద్యుత్కేంద్రం యాజమాన్యం జాలర్ల సంఘాల ప్రతినిధులతో అప్పట్లో ఒప్పందం కుదుర్చుకుంది. అది ఇప్పటి వరకూ అమలుకు నోచుకోలేదు. దీంతో ఎన్నూరు కుప్పం ప్రాంతానికి చెందిన సుమారు వంద మందికి పైగా జాలర్లు సోమవారం ఉదయం ఫైబర్ బోర్లలో సముద్ర ముఖద్వారం ప్రాంతానికి వెళ్లారు. 

థర్మల్ కేంద్రం నుంచి నీరు విడుదల చేస్తున్న ముఖద్వారాన్ని  ఇసుక బస్తాలతో మూసి వేశారు. సమాచారం తెలిసి అక్కడికి చేరుకున్న ఎన్నూరు పోలీసులు విద్యుత్ బోర్డు అధికారుల సమక్షంలోఆందోళనకారులతో చర్చలు జరిపారు. కాగా,  తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం ఆగదని జాలర్లు తేల్చిచెప్పారు. 

 

PREV
click me!

Recommended Stories

Indigo కు షాక్: 10 శాతం విమానాలు రద్దు.. రంగంలోకి ప్రత్యేక టీమ్ తో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. పెంచుతుంది : యోగి ఆసక్తికర కామెంట్స్