School Roof Collapses: స్కూల్ పైకప్పు కూలిపడటంతో మ‌హిళా టీచర్ మృతి..

Published : Aug 24, 2023, 03:57 AM IST
School Roof Collapses: స్కూల్ పైకప్పు కూలిపడటంతో మ‌హిళా టీచర్ మృతి..

సారాంశం

Ludhiana: స్కూల్ పైక‌ప్పు కూలిప‌డ‌టంతో ఒక టీచ‌ర్ ప్రాణాలు కోల్పోయారు. ప‌లువురు గాయ‌ప‌డ్డారు. ఈ విషాద‌క‌ర ఘ‌ట‌న పంజాబ్ లోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో చోటుచేసుకుంది. ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాలలోని స్టాఫ్ రూమ్ లో నలుగురు ఉపాధ్యాయులు కూర్చొని ఉండగా ఈ ఘటన జరిగింది.  

Teacher dies after school roof collapses: స్కూల్ పైక‌ప్పు కూలిప‌డ‌టంతో ఒక టీచ‌ర్ ప్రాణాలు కోల్పోయారు. ప‌లువురు గాయ‌ప‌డ్డారు. ఈ విషాద‌క‌ర ఘ‌ట‌న పంజాబ్ లోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో చోటుచేసుకుంది. ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాలలోని స్టాఫ్ రూమ్ లో నలుగురు ఉపాధ్యాయులు కూర్చొని ఉండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు.

వివ‌రాల్లోకెళ్తే.. పంజాబ్ లోని లూధియానాలో ఫిరోజ్ పూర్ రోడ్డులోని బద్దోవాల్ లో ప్రభుత్వ పాఠశాల పైకప్పు కూలి 45 ఏళ్ల మహిళా టీచర్ మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పాఠశాల ఆవరణలో పునరుద్ధరణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ పై మెజిస్టీరియల్ విచారణకు, ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశించారు. ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాలలోని స్టాఫ్ రూమ్ లో నలుగురు ఉపాధ్యాయులు కూర్చొని ఉండగా ఈ ఘటన జరిగింది.

స్కూల్ పైక‌ప్పు కూలిన వెంట‌నే వీరిని హుటాహుటిన ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే టీచర్ రవీందర్ కౌర్ మృతి చెందినట్లు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దీప్కరణ్ సింగ్ తూర్ తెలిపారు. పైకప్పు కూలిపోవడానికి గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. గాయపడిన ముగ్గురు టీచర్లు నరీందర్ జీత్ కౌర్, సుఖ్ జీత్ కౌర్, ఇందు రాణి చికిత్స పొందుతున్నారని, వారు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం లూథియానా డిప్యూటీ కమిషనర్ (డీసీ) సురభి మాలిక్ మాట్లాడుతూ కాంట్రాక్టర్ పై లుధియానా రూరల్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని తెలిపారు.

ఈ ప్రమాదాన్ని సీఎం భ‌గ‌వంత్ మన్ తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారని  తెలిపారు. పాఠశాల భవనాన్ని భద్రతా మదింపు చేయాలని ఆదేశించామనీ, భవనాన్ని కూడా సీల్ చేశామని, మూల్యాంకనం పూర్తయ్యే వరకు పాఠశాల సమీపంలో నివసిస్తున్న ప్రజలు భవనం వద్దకు వెళ్లవద్దని డీసీ సుర‌భి మాలిక్ విజ్ఞప్తి చేశారు. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే అధికార యంత్రాంగానికి చెందిన పలు బృందాలను సంఘటనా స్థలానికి పంపామనీ, శిథిలాల కింద చిక్కుకున్న నలుగురు ఉపాధ్యాయులను రక్షించడానికి ఇండో-టిబెటన్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ), జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) సిబ్బందిని పిలిపించామని డీసీ తెలిపారు. ఉపాధ్యాయులను బృందాలు బయటకు తీసి వెంటనే ఆసుపత్రికి తరలించాయని చెప్పారు. టీచర్ల వైద్య ఖర్చులన్నీ పంజాబ్ ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?