
Chandrayaan-3: ఇస్రో మూడవ చంద్ర మిషన్ చంద్రయాన్-3లోని ల్యాండర్ మాడ్యూల్ విజయవంతంగా ల్యాండ్ కావడంతో, భారతదేశం సరికొత్త చరిత్రను సృష్టించింది. చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో అడుగుపెట్టిన తొలి దేశంగా నిలిచింది. ఇక ప్రస్తుతం చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై దిగిన నాలుగు గంటల తర్వాత విక్రమ్ ల్యాండర్ నుంచి రోవర్ ప్రగ్యాన్ బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో పంచుకుంది.
వివరాల్లోకెళ్తే.. ఇస్రో మూడవ చంద్ర మిషన్ చంద్రయాన్-3లోని ల్యాండర్ మాడ్యూల్ విజయవంతంగా ల్యాండ్ కావడంతో, భారతదేశం సరికొత్త చరిత్రను సృష్టించింది. చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో అడుగుపెట్టిన తొలి దేశంగా నిలిచింది. ఇంతకుముందు ఈ ఘనత సాధించిన యూఎస్ఎస్ఆర్, యూఎస్, చైనాల తర్వాత చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాల్గవ దేశంగా భారత్ నిలిచింది. ఇస్రో శాస్త్రవేత్తల బృందాన్ని అభినందించిన ప్రధాని మోడీ, "భారతదేశం విజయవంతమైన చంద్ర మిషన్ భారతదేశం మాత్రమే కాదు... ఒకే భూమి, ఒకే కుటుంబం ఒకే భవిష్యత్తు అనే మన విధానం ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోంది... మూన్ మిషన్ కూడా అదే మానవ కేంద్రీకృత విధానంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి, ఈ విజయం మానవాళి మొత్తానికి చెందుతుందని పేర్కొన్నారు.
ఇస్రో మూడవ చంద్ర మిషన్ చంద్రయాన్-3లోని ల్యాండర్ మాడ్యూల్ విజయవంతంగా ల్యాండ్ అయింది. చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ నిలిచింది. ఇక ప్రస్తుతం చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై దిగిన నాలుగు గంటల తర్వాత విక్రమ్ ల్యాండర్ నుంచి రోవర్ ప్రగ్యాన్ బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో పంచుకుంది. ఈ ప్రగ్యాన్ రోవర్ చంద్రుని ఉపరితలంపై తిరుగుతూ అక్కడి పరిస్థితులను, సంబంధిత దృశ్యాలను ఇస్రోకు పంపించనుంది. చంద్రునిపై ప్రగ్యాన్ రోవర్ సెకనుకు సెంటీమీటర్ చొప్పున ముందుకు కదులుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ క్రమంలోనే చంద్రునిపై భారత ముద్ర నాలుగు సింహాలు, ఇస్రో చిహ్నాన్ని అక్కడి ఉపరితలంపై ముంద్ర వేయనుంది.