
కర్ణాటక : కర్ణాటకలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ అనుమానాస్పద రీతిలో చనిపోయింది. బుడకట్టు సముదాయానికి చెందిన ఆ మహిళ అర్థ రాత్రి ఇంట్లో నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. ఆమె శరీర భాగాలు ఇంటి వెనక ఉన్న కాఫీ తోటలో దొరికాయి. కర్ణాటకలోని గొడవ జిల్లా పొన్నంపేట తాలూకాలోని హుదికెరె దగ్గర బెళ్లూరిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలు చోందు (25).. ఫణి రాజు అనే వ్యక్తి భార్యగా గుర్తించారు.
బెళలూరు గిరిజన హాడికి చెందిన చోందు శనివారం అర్ధరాత్రి ఇంట్లో నుంచి బయటికి వెళ్లింది. ఆ తర్వాత మళ్లీ ఎవరికి కనిపించలేదు. ఆమె మృతదేహం విడిభాగాలు.. కాళ్లు, చేతులు, దుస్తులు ఇంటి వెనక ఉన్న కాఫీ తోటలో దొరికాయి. శనివారం అర్ధరాత్రి నుంచి ఆమె కనిపించకుండా పోవడంతో తెల్లవారుజామున.. ఆమెను వెతుకుతూ వెళ్లిన భర్తకి ఇవి కనిపించాయి.
సెక్స్ వర్క్ నేరం కాదు, కానీ.. : ముంబయి కోర్టు సంచలన తీర్పు
ఇంటి వెనక సుమారు 500 మీటర్ల దూరంలోని పొదల్లో కాళ్లు, చేతులు, బట్టలు, కొన్ని ఎముకలు దొరికాయి. వాటిని చూసిన భర్త గట్టిగా కేకలు వేశాడు. అతని కేకలు విన్న సమీపంలోని వారు అక్కడికి చేరుకున్నారు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి అందరూ భయాందోళనలకు గురయ్యారు.
వెంటనే మృతురాలి సోదరి నేత్ర శ్రీమంగళం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. పరిశీలించి, కేసు నమోదు చేశారు. చోందును ఎవరైనా హత్య చేశారా? లేక ఆమె అర్ధరాత్రి పూట బహిర్భూమికి బయటకి వస్తే.. చిరుత లేదా పులి వంటివి దాడి చేసి చంపేశాయా? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఈ ఘటనతో స్థానికంగా తీవ్రభయాందోళనలు నెలకొన్నాయి.