హాత్ సే హత్ జోడో అభియాన్ కి పరిశీలకుల నియామకం:పలు రాష్ట్రాలకు తెలుగు నేతలకు బాధ్యతలు

By narsimha lodeFirst Published Dec 27, 2022, 5:11 PM IST
Highlights

హత్ సే హత్ జోడో  కార్యక్రమానికి  ఆయా రాష్ట్రాలకు పరిశీలకులను ప్రకటించింది  ఎఐసీసీ.  తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు పలు రాష్ట్రాల్లో  ఈ కార్యకమానికి  పరిశీలకులుగా వెళ్లనున్నారు. 

న్యూఢిల్లీ:  హాత్ సే హత్  జోడో అభియాన్ కార్యక్రమానికి పలు రాష్ట్రాలకు   పరిశీలకులను నియమించింది  ఎఐసీసీ. వచ్చే ఏడాది జనవరి  26వ తేదీ నుండి  హాత్ సే హాత్ జోడో  కార్యక్రమాన్ని ఆయా రాష్ట్రాల్లో ప్రారంభించనున్నారు కాంగ్రెస్  పార్టీ నేతలు. ఆయా రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం జరుగుతున్న తీరు తెన్నులను  పరిశీలించేందుకు గాను  ఎఐసీసీ చీఫ్  మల్లికార్జున ఖర్గే  పరిశీలకులను నిమయించారు.ఈ మేరకు ఇవాళ  పరిశీలకుల జాబితాను   ఖర్గే  ప్రకటించారు.తెలంగాణకు  గిరీష్ చోగడాంకర్, ఏపీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి, గోవాకి శైలజానాథ్ , పుదుచ్చేరికి వి. హనుమంతరావు,మహారాష్ట్రకుపల్లంరాజులను  కాంగ్రెస్ పార్టీ  పరిశీలకులుగా నియమించింది.కాంగ్రెస్ పార్టీ అగ్రనేత  రాహుల్ గాంధీ  భారత్ జోడో యాత్రకు  కొనసాగింపుగా  ఆయా రాష్ట్రాల్లో  పరిశీలకులుగా  నియమించింది 

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత  రాహుల్ గాంధీ  భారత్ జోడో యాత్రకు  కొనసాగింపుగా  ఆయా రాష్ట్రాల్లో  పరిశీలకులుగా  నియమించింది  కాంగ్రెస్ పార్టీ. తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి నుండి జమ్మూ కాశ్మీర్ వరకు  రాహుల్ గాంధీ  పాదయాత్రను నిర్వహిస్తున్నారు. రాహుల్ గాంధీ పాదయాత్ర  ఢిల్లీలో  కొనసాగుతుంది.  ప్రజలతో పార్టీ శ్రేణులు సంబంధాలు కొనసాగించేలా  కాంగ్రెస్ పార్టీ  హాత్ సే హత్ జోడో  అభియాన్  కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. దేశ ప్రజలను సమైక్యంగా ఉంచేందుకు తాను పాదయాత్రను నిర్వహిస్తున్నట్టుగా  రాహుల్ గాంధీ ప్రకటించిన విషయం తెలిసిందే.  రాహుల్ గాంధీ ఈ యాత్రతో  పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపే ప్రయత్నం చేస్తున్నారు.భారత్ జోడో  యాత్ర కారణంగా  హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి రాహుల్ గాంధీ దూరంగా  ఉన్నారు.

click me!