విడాకుల కోసం కోర్టుకు వచ్చి.. భార్యపై కత్తిపోట్లు.. ఓ భర్త దారుణం...

Published : Apr 30, 2022, 08:17 AM IST
విడాకుల కోసం కోర్టుకు వచ్చి.. భార్యపై కత్తిపోట్లు.. ఓ భర్త దారుణం...

సారాంశం

డైవోర్స్ కోసం కోర్టుకు వచ్చిన ఓ వ్యక్తి కోర్టు ఆవరణలోనే భార్యమీద కత్తితో దాడి చేశాడు. విడాకులు తీసుకోకముందే భార్య మీద కక్ష సాధించాడు.

చెన్నై : భార్యతో divorce కోసం కోర్టుకు వచ్చిన ఓ భర్త అందరూ చూస్తుండగానే ఆమెపై knifeతో విచక్షణారహితంగా దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. tamilnaduలోని పెరంబదూర్ జిల్లా కోర్టు వద్ద చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుధా, కామరాజు అనే దంపతులు విడిపోయి గత కొన్నేళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. విడాకుల కోసం courtను ఆశ్రయించగా.. ఆ కేసు విచారణ కొనసాగుతోంది. అయితే, శుక్రవారం ఈ కేసు విచారణ కోసం వారిద్దరూ అనుకోకుండా ఒకే బస్సులో ప్రయాణం చేసి వచ్చారు.

కోర్టు బస్ స్టాప్ వద్ద దిగగానే... దాచి పెట్టుకొని వచ్చిన కత్తితో  కామ్ రాజ్.. తన భార్యపై దాడి చేశాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని హత్యాయత్నం నేరం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ మణి వెల్లడించారు. అదే బస్సు నుంచి దిగిన ఓ పోలీసు, కోర్టు బయట విధులు నిర్వర్తించే వ్యక్తి అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఒకరికి తీవ్ర గాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు. మహిళకు చికిత్స కొనసాగుతుందన్నారు. ఈ జంట గత కొన్నేళ్లుగా విడాకుల కోసం పోరాడుతుండగా.. ప్రస్తుతం ఈ కేసు ఆఖరి దశలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 

ఇదిలా ఉండగా, వివాహమై పది నెలలు. dowry harassment ఎక్కువై తన జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకుందో software employee. వేధింపులు భరించలేక పుట్టింటికి వచ్చినా భర్త ఆగడాలు ఆగకకపోవడమే కారణమని తెలుస్తోంది. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల పట్టణానికి చెందిన జూపల్లి శ్రీనివాసరావు కొన్ని నెలల క్రితం తన కుటుంబంతో నగరానికి వలస వచ్చాడు. కూకట్పల్లి బాలకృష్ణ నగర్ లోని ప్లాట్ నెంబర్ 158లో ఉంటున్నారు. ప్రైవేటు ఉద్యోగి అయిన ఆయనకు ఇద్దరు కుమార్తెలు.  సాఫ్ట్వేర్ ఉద్యోగిని అయిన పెద్ద కుమార్తె నిఖిత (26)కు సిరిసిల్ల పట్టణానికే చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి చేటి ఉదయ్ తో గతేడాది జూన్ 6 న వివాహం జరిపించారు.  

వివాహ సమయం రూ.10 లక్షల నగదు, 35 తులాల బంగారు ఆభరణాలను ఇచ్చారు. శ్రీనివాసరావుకు సొంతూరులో 4.25 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా అందులో సగం భూమిని తన పేరిటగానీ, తన తల్లిదండ్రుల పేరుతో గానీ రాయించాలని నిఖిత భర్త వేధిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు శ్రీనివాసరావు సమ్మతించకపోగా తన మరణానంతరం ఆస్తి చెందుతుందని తెగేసి చెప్పాడు. దీంతో ఉదయ్ తనకు అదనపు కట్నం కావాలంటూ భార్యను నిత్యం వేధించేవాడు.  దీంతో శ్రీనివాసరావు ఇటీవల అల్లుడికి మరో పది లక్షలు ఇచ్చాడు.  అయినా ఉదయ్ ది అదే తీరు. అత్తమామలు  అశోక్ రావు, శ్యామల, మరిది ఉపేందర్ సైతం ఉదయ్ కి వంత పాడుతుండడంతో నిఖిత ఉగాది రోజైన (ఏప్రిల్ 2న) కూకట్పల్లిలోని  పుట్టింటికి వచ్చింది. అయినా రోజు  ఫోన్లో భార్యను వేధించేవాడు.

ఒకవేళ ఫోన్ తీయకపోతే ఆమె సోదరి నీతకు ఫోన్ చేసి దూషించేవాడు. ఈ నెల 20న అత్తగారి ఇంటికి వచ్చి గొడవ పడ్డాడు. బుధవారం రాత్రి 7 గంటల సమయంలో భార్యాభర్తలకు తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. ఆ సమయంలో భార్య మెడలోని మంగళసూత్రాలు తెంపి ఆమెను తీవ్రంగా కొట్టాడు. దీంతో మనస్థాపం చెందిన నిఖిత బెడ్ రూంలోకి వెళ్లి తలుపు వేసుకుంది. రాత్రి పది గంటలు దాటినా తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబీకులు తలుపు బద్దలుకొట్టి చూడగా ఫ్యాన్ కు ఉరి వేసుకుని చనిపోయింది. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?