నడిరోడ్డుమీద ఈ అమ్మడు వంగి చేసిన పనికి.. అందరూ ఫిదా...

By AN TeluguFirst Published Apr 9, 2021, 2:38 PM IST
Highlights

అభివృద్ధి పేరుతో మనిషి నగరాల్ని విస్తరిస్తున్నాడు. అడవుల్ని ఆక్రమిస్తున్నాడు. నీటి ఆవాసాల్నీ ఆక్యుపై చేస్తున్నాడు. దీంతో వన్యప్రాణులు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. రోడ్లమీద పులులు తిరగడం, కోతులు, పాములు రోడ్లమీద కనిపించడం దీని పరిణామమే. 

ముంబై : అభివృద్ధి పేరుతో మనిషి నగరాల్ని విస్తరిస్తున్నాడు. అడవుల్ని ఆక్రమిస్తున్నాడు. నీటి ఆవాసాల్నీ ఆక్యుపై చేస్తున్నాడు. దీంతో వన్యప్రాణులు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. రోడ్లమీద పులులు తిరగడం, కోతులు, పాములు రోడ్లమీద కనిపించడం దీని పరిణామమే. 

వాటి ప్రాంతాల్లోకి మనం వెళ్లామా, మన ప్రాంతాల్లోకి అవి వస్తున్నాయా.. అనే చర్చ పక్కన పెడితే అలాంటి వన్యప్రాణులు కనిపించినప్పుడు కాస్త మానవత్వం చూపించడం ప్రకృతిలో బుద్దిజీవి అయిన మానవుడి కనీస బాధ్యత. 

మానవత్వాన్ని చాటుకునేందుకు ఎందుకు, ఎక్కడ, ఎలా, ఏం చేస్తున్నాం అనేది అవసరం లేదు. ఈ ప్రపంచంలో మనతో పాటు కలిసి జీవిస్తున్న ప్రాణులను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనుషులుగా మనపై ఉంది.

 ఇలా రోడ్డుపై వెళ్తున్న మహిళ ఓ తాబేలును ఆదుకునేందుకు స్పందించిన తీరు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో  ఇప్పుడు వైరల్ గా మారింది. 

విషయం ఏంటంటే ఎక్కడినుంచి వచ్చిందో ఓ బుల్లి తాబేలు.. రోడ్డుమీద వేగంగా దూసుకెడుతున్న కార్ల మధ్యకు వచ్చేసింది. ఈ విషయాన్ని అటుగా వెడుతున్న ఓ మహిళ గమనించింది. 

జాగింగ్ కే వచ్చిందో.. ఎక్కడో జాగింగో, వాకింగో చేసే వస్తుందో ఫిట్ నెస్ డ్రెస్ లో ఉందా మహిళ.. ఆ తాబేలు రక్షించేందుకు... చిన్న క్లాత్ లాంటివి తీసుకుని దాని దగ్గరికి వెళ్లింది. నెమ్మదిగా దాన్ని రెండు చేతుల్లోని బట్టలతో పట్టుకుని.. రోడ్డుకు ఓ వైపు బాగా పచ్చగా ఉన్నచోట వదిలేసింది. 

ప్రస్తుతం ఇంటర్నెట్ లో ఈ వీడియో లైక్స్, కామెంట్స్ తో దూసుకు పోతోంది. హార్ట్ ఎమోజీ లతో నెటిజన్లు తాబేలును రక్షించినందుకు మహిళను తెగ మెచ్చుకుంటున్నారు.

click me!