హిడ్మా చరిత్రలో కలిసిపోవవడం ఖాయం: సీఆర్‌పీఎఫ్ డీజీ

By narsimha lodeFirst Published Apr 9, 2021, 1:10 PM IST
Highlights

మావోయిస్టు అగ్రనేత హిడ్మా చరిత్రలో కలిసిపోవడం ఖాయమని సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ కుల్దీప్ సింగ్ చెప్పారు.

రాయ్‌పూర్: మావోయిస్టు అగ్రనేత హిడ్మా చరిత్రలో కలిసిపోవడం ఖాయమని సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ కుల్దీప్ సింగ్ చెప్పారు.గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. నక్సలైట్లు అడవుల్లో 100 కి.మీ పరిధి నుండి 20 కి.మీ పరిధికి కుంచించుకుపోయిందన్నారు. ఇక మావోయిస్టులు తప్పించుకుపోవడం అసాధ్యమన్నారు.

మావోయిస్టుల ఏరివేతలో బలగాలు క్రమంగా పుంజుకొంటున్నాయని ఆయన తెలిపారు. నక్సల్స్ తలదాచుకొన్న ప్రాంతాలను గుర్తించి వారిని బయటకు తీసుకొస్తామన్నారు. ఇదంతా ఏడాదిలోపుగా పూర్తి చేస్తామని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.2013లో ఛత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ నేతలపై దాడిలో హిడ్మా కీలక పాత్ర పోషించాడు. తాజా ఎన్ కౌంటర్ లో కూడ ఆయనే వ్యూహారచన చేశారని భద్రతా  బలగాలు అనుమానిస్తున్నాయి.

తమ దాడిలో మావోల వైపు నుండి కూడా భారీగా నష్టం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. చనిపోయిన వారి మృతదేహాల తరలింపు కోసం మావోలు నాలుగు ట్రాక్టర్లను ఉపయోగించారని ఆయన చెప్పారు.బీజాపూర్ జిల్లాలో ఈ నెల 3న జరిగిన ఎన్ కౌంటర్  సమయంలో 450 మంది జవాన్లు ఉన్నారని ఆయన చెప్పారు.

7 నుండి 8 కిలోమీటర్ల పరిధిలో వారంతా మావోలతో పోరాటం చేశారని ఆయన గుర్తు చేశారు. గాయపడిన వారిని తమతో తీసుకొచ్చారని అంతేకాదు ఈ దాడి గురించి తమకు సమాచారం కూడ ఇచ్చారన్నారు.జవాన్ల బలిదానాలు వృధాకావని ఆయన చెప్పారు. మావోయిస్టులపై ప్రతీకారం తప్పదని డీజీ చెప్పకనే చెప్పారు.
 

click me!