జమ్మూలో ఎన్‌కౌంటర్: కీలకనేత సహా ఏడుగురు ఉగ్రవాదుల హతం

Published : Apr 09, 2021, 01:40 PM IST
జమ్మూలో ఎన్‌కౌంటర్: కీలకనేత సహా ఏడుగురు ఉగ్రవాదుల హతం

సారాంశం

జమ్మూ కాశ్మీర్ లో శుక్రవారం నాడు జరిగిన వేర్వేరు ఎన్ కౌంటర్లలో  ఏడుగురు ఉగ్రవాదులు మరణించారు.  ఈ ఎన్‌కౌంటర్లలో ఓ ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక నేత కూడ మరణించినట్టుగా భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి.

శ్రీనగర్:జమ్మూ కాశ్మీర్ లో శుక్రవారం నాడు జరిగిన వేర్వేరు ఎన్ కౌంటర్లలో  ఏడుగురు ఉగ్రవాదులు మరణించారు.  ఈ ఎన్‌కౌంటర్లలో ఓ ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక నేత కూడ మరణించినట్టుగా భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి.

గురువారం నాడు రాత్రి షోపియన్ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎన్ కౌంటర్ జరిగింది.  ఈ ఎన్ కౌంటర్ లో ఐదుగురు ఉగ్రవాదులు మరణించారు. నలుగురు సైనికులు కూడ గాయపడ్డారు.  మృతుల్లో ఘజ్వత్ ఉల్ హింద్ ఉగ్రవాద సంస్థ నేత ఇంతియాజ్ షా కూడ ఉన్నారని  భద్రతా దళాలు ప్రకటించాయి.

శుక్రవారం నాడు పుల్వామా జిల్లాలో మరో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు.  ఈ రెండు జిల్లాల్లో  ఇంటర్నెట్ సదుపాయాన్ని అధికారులు నిలిపివేశారు.జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేతకు  భద్రతాబలగాలు భారీ ఎత్తున చర్యలు చేపడుతోంది. ఉగ్రవాద సంస్థల్లో చేరినవారిని తిరిగి ఇంటికి రప్పించేందుకు కుటుంబసభ్యులతో లొంగిపోవాలని కోరేలా భద్రతా బలగాలు చేస్తున్నాయి.
 

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..