భర్త స్నేహితుడి ఘాతుకం: కేసులో సాయం చేస్తానని, కోర్టు గదిలోనే అత్యాచారం

Siva Kodati |  
Published : Jun 23, 2020, 06:04 PM IST
భర్త స్నేహితుడి ఘాతుకం: కేసులో సాయం చేస్తానని, కోర్టు గదిలోనే అత్యాచారం

సారాంశం

ఢిల్లీలో దారుణం జరిగింది. ఏకంగా కోర్టు ఆవరణలోనే ఓ వ్యక్తి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. వివరాల్లోకి వెళ్లితే... సోమవారం మధ్యాహ్నం పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఓ మహిళ తనపై అత్యాచారం జరిగినట్లు తెలిపారు.

ఢిల్లీలో దారుణం జరిగింది. ఏకంగా కోర్టు ఆవరణలోనే ఓ వ్యక్తి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్లితే... సోమవారం మధ్యాహ్నం పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఓ మహిళ తనపై అత్యాచారం జరిగినట్లు తెలిపారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు  కోర్టు గదికి చేరుకుని ఆమె వాంగ్మూలం తీసుకున్నారు. ఘటనా స్థలంలో నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడిని రాజేంద్ర సింగ్‌గా గుర్తించారు. అతనిపై సెక్షన్ 376 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా లేబర్ కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులో సాయం చేస్తానని నమ్మించి నిందితుడు తనపై అత్యాచారానికి పాల్పడినట్లుగా బాధితురాలు ఆరోపించింది.

అతను కోర్టులో పనిచేసే సిబ్బందిలో ఒకరని కూడా తెలిపారు. అయితే బాధితురాలు, నిందితుడు ఒకరికొకరు ముందే తెలుసునని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అతను బాధితురాలి భర్తకు స్నేహితుడని పోలీసులు గుర్తించారు. 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌