ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి పతంజలి యోగా సంస్థ మందును కనిపెట్టినట్టుగా ప్రకటించింది. ఇవాళ ఈ మెడిసిన్ ను మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ మేరకు పతంజలి సీఈఓ ఆచార్య బాలకృష్ణ ప్రకటించారు.
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి పతంజలి యోగా సంస్థ మందును కనిపెట్టినట్టుగా ప్రకటించింది. ఇవాళ ఈ మెడిసిన్ ను మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ మేరకు పతంజలి సీఈఓ ఆచార్య బాలకృష్ణ ప్రకటించారు.
కరోనాను ఆయుర్వేదం ద్వారా నయం చేయవచ్చని తాము విశ్వసిస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. దీనికి సంబంధించిన మెడిసన్ రెడీ చేసి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించినట్టుగా ఆయన ప్రకటించారు.
undefined
హరిద్వార్ లోని పతంజలి యోగా పీఠ్ వేదికగా ఈ మెడిసిన్ శాస్త్రీయత గురించి వెల్లడించనున్నట్టుగా ఆయన ప్రకటించారు. ఈ మెడిసిన్ తో కరోనా సోకిన రోగులు నాలుగైదు రోజుల్లో కోలుకొంటున్నట్టుగా ఆయన తెలిపారు.ఈ మెడిసిన్‌కు స్వసరీ వాటి, కరోనిల్ అని నామకరణం కూడా చేశారు.
కరోనాను నిరోధించేందుకు గాను దేశంలో ఇప్పటికే గ్లెన్ మార్క్ సంస్థ టాబ్లెట్లను విడుదల చేసింది. హైద్రాబాద్ హెటిరో సంస్థ కూడ ఇంజక్షన్ రూపంలో కరోనాకు మందును కనిపెట్టినట్టుగా ప్రకటించింది.కరోనాకు చెక్ చెప్పేందుకు మొదటి ఆయుర్వేద ఆధారిత ఆయుర్వేద ఔషధం తామే రూపొందించినట్లు తెలిపారు.