Latest Videos

భర్తతో గొడవపడి అర్థరాత్రి బైటికి వచ్చిన భార్య.. లిఫ్ట్ ఇచ్చి నరకం చూపించిన కుర్రాళ్లు...

By SumaBala BukkaFirst Published Dec 28, 2021, 1:03 PM IST
Highlights

తీవ్ర గాయాలతో ఉన్న  ఒక మహిళ  కాలువలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఆమె పరిస్థితి విషమంగా ఉంది.  ఆమె వాంగ్మూలం తీసుకున్న పోలీసులు కారు వెళ్ళిన దారిలో సీసీటీవీ వీడియోను పరిశీలిస్తున్నారు.

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో లో అర్ధరాత్రి ఒక mariied woman తన భర్తతో గొడవపడి ఇల్లు వదిలి బయటకి వచ్చేసింది. తన బంధువుల ఇంటికి బయల్దేరిన ఆమెకు దారిలో ఒక carలో ఇద్దరు కుర్రాళ్లు lift ఇచ్చారు. కొంతదూరం వెళ్ళాక ఆ కుర్రాళ్ళు ఆమెపై molestationకు పాల్పడి,  ఆ తరువాత ఓ కాలువలో పడేశారు.

అప్పటికే తీవ్రగాయాలతో ఉండడంతో ఆమె కాలువలోనే బాధతో మూలుగుతూ ఉండిపోయింది. ఇది గమనించిన స్థానికులు.. తీవ్ర గాయాలతో ఉన్న  ఒక మహిళ  కాలువలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఆమె పరిస్థితి విషమంగా ఉంది.  ఆమె వాంగ్మూలం తీసుకున్న పోలీసులు కారు వెళ్ళిన దారిలో సీసీటీవీ వీడియోను పరిశీలిస్తున్నారు.

ఇదిలా ఉండగా, దేశ రాజధాని న్యూడిల్లీలో నిర్భయ ఘటన మాదిరిగానే ఉత్తరప్రదేశ్ లో మరో దారుణం వెలుగుచూసింది. ఎస్సై పరీక్ష రాసి వస్తున్న యువతిని నమ్మించి కారులో ఎక్కించుకున్న దుండగుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కదులుతున్న కారులోనే యువతిపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నవంబర్ 26న జరిగింది.

ఈ అమానుష ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. uttar pradesh state రాష్ట్రంలోని మథురకు చెందిన 21ఏళ్ల యువతి పోలీస్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల యూపీ ప్రభుత్వం ఎస్సై ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడంతో దరఖాస్తు చేసుకుంది. నియామక ప్రక్రియలో భాగంగా రాతపరీక్షకు హాజరయ్యింది. ఆగ్రాలో పరీక్షా కేంద్రం వుండటంతో ఒంటరిగానే వెళ్లింది. 

తొమ్మిదేళ్ల చిన్నారిపై పక్కింటి వ్యక్తి అత్యాచారం.. చాక్లెట్ ఆశచూపి....

పరీక్ష రాసి తిరిగివస్తున్న క్రమంలో యువతికి సోషల్ మీడియా స్నేహితుడు తేజ్ వీర్ తారసపడ్డాడు. తన కారులో ఇంటికి దింపుతానని అతడు కోరడంతో నమ్మిన యువతి కారెక్కింది. అయితే అప్పటికే కారులో తేజ్ వీర్ తో పాటు దిగంబర్ అనే మరో యువకుడు వున్నాడు. 

నమ్మి కారెక్కిన యువతిపై కదులుతున్న కారులోనే తేజ్ వీర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దిగంబర్ కారు డ్రైవింగ్ చేస్తుండగా వెనకసీట్లో యువతిపై తేజ్ వీర్ అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం యువతిని మథుర శివారులోని కోసి కలాన్‌ వద్ద వదిలి వెళ్లిపోయారు. 

ఇంటికివెళ్ళిన తర్వాత తనపై జరిగిన అఘాయిత్యం గురించి యువతి సోదరుడికి తెలిపగా అతడు పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాధిత యువతి తెలిపిన వివరాల మేరకు నిందితుల ఆఛూకీ గుర్తించారు. నిందితులిద్దరూ హరియానాకు చెందినవారిగా గుర్తించారు.

అయితే పోలీసుల గాలింపు విషయం తెలిసి ఇద్దరు నిందితులు పరారయ్యారు. అయితే ప్రత్యేక బృందాలు నిందితుల కోసం ముమ్మరంగా గాలించి గురువారం ప్రధాన నిందితుడు తేజ్ వీర్ ను అరెస్ట్ చేసారు. 
ఈ అత్యాచార ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి యువతికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. అలాగే యువతి వాంగ్మూలం కూడా తీసుకున్నట్లు తెలిపారు. అత్యాచారం కోసం నిందితులు ఉపయోగించిన కారును కూడా పోలీసులు స్వాదీనం చేసుకున్నారు.  

click me!