ప్రొఫెసర్ భార్య.. సోషల్ మీడియాలో అశ్లీల చిత్రాలు పోస్ట్ చేసి..

Published : Jun 27, 2020, 01:11 PM ISTUpdated : Jun 27, 2020, 01:13 PM IST
ప్రొఫెసర్ భార్య.. సోషల్ మీడియాలో అశ్లీల చిత్రాలు పోస్ట్ చేసి..

సారాంశం

దాక్షాయని కూడా ఓ కళాశాలలో ప్రొఫెసర్. కొద్ది నెలల క్రితం భర్తతో విభేదాలు రావడంతో దాక్షాయని తన పుట్టింటికి చేరింది. అయినా భర్తపై కోపం చల్లారని ఆమె ఎలాగైనా అతనిని ఇబ్బంది పెట్టాలని నిర్ణయించుకుంది. 

ఆమె ఓ ప్రొఫెసర్ కి భార్య.. అయితే భర్త మీద కోపంతో ఆమె చేసిన పని అందరినీ విస్మయానికి గురిచేసింది. భర్తను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో.. ఆయన ఫేస్ బుక్ నుంచి అశ్లీల చిత్రాలు పోస్టు చేసింది. కాగా.. ప్రస్తుతం ఆమె పరారీలో ఉండగా.. పోలీసులు గాలిస్తున్నారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

తిరుచ్చి భీంనగర్‌ ఖాజీయార్ వీధికి చెందిన మోహన్ జయగణేష్(32) తిరుచ్చిలో అన్నా వర్సిటీ ఆధీనంలోని ఎయిడెడ్ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు మైలాడుదురై కురింజినగర్‌కు చెందిన దాక్షాయని(28)తో మూడేళ్ల క్రితం వివాహమైంది. దాక్షాయని కూడా ఓ కళాశాలలో ప్రొఫెసర్. కొద్ది నెలల క్రితం భర్తతో విభేదాలు రావడంతో దాక్షాయని తన పుట్టింటికి చేరింది. అయినా భర్తపై కోపం చల్లారని ఆమె ఎలాగైనా అతనిని ఇబ్బంది పెట్టాలని నిర్ణయించుకుంది. 

తన స్నేహితుడు తంజాపూర్ జిల్లా శివాజినగర్‌కు చెందిన కృపాకరన్ సాయంతో మోహన్ జయగణేష్ ఫేస్‌బుక్‌ను హ్యాక్ చేసి కొందరి మహిళల అశ్లీల దృశ్యాలను పోస్ట్ చేయించింది. దాక్షాయని ఊహించిన విధంగానే  మోహన్ జయగణేష్ ఫేస్‌బుక్‌లో ఆయనను దూషిస్తూ పలు పోస్ట్‌లు వచ్చాయి. దీనిపై ఆయన పాలక్కరై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని తప్పుగా వినియోగించారంటూ 5 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కృపాకరన్‌ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న దాక్షాయని కోసం గాలిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Viral News : ఇక జియో ఎయిర్ లైన్స్.. వన్ ఇయర్ ఫ్రీ..?
Viral News: పెరుగుతోన్న విడాకులు.. ఇకపై పెళ్లిళ్లు చేయకూడదని పండితుల నిర్ణయం