భారత్ లో కరోనా.. 5లక్షలు దాటిన కేసులు

By telugu news team  |  First Published Jun 27, 2020, 11:05 AM IST

దీనితో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 5 లక్షల మార్క్ దాటేసింది.దేశవ్యాప్తంగా 5,08,953 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 1,97,387 యాక్టివ్ కేసులు ఉండగా.. 15,685 మంది కరోనాతో మరణించారు. 


భారత్ లో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. ఊహించని విధంగా కేసులు బాగా పెరిగిపోతున్నాయి. ప్రతి రోజూ దాదాపు 15వేలకు పైగా కేసులు నమోదౌతున్నాయి. వరుసగా ఏడో రోజు కరోనా కేసుల మార్క్ 14 వేలు దాటింది. శుక్రవారం ఒక్కరోజే 18వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.

గడిచిన 24 గంటల్లో 18,552 కేసులు, 384 మరణాలు సంభవించాయి. దీనితో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 5 లక్షల మార్క్ దాటేసింది.దేశవ్యాప్తంగా 5,08,953 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 1,97,387 యాక్టివ్ కేసులు ఉండగా.. 15,685 మంది కరోనాతో మరణించారు. 

Latest Videos

ఇక 2,95,881 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలోని 5 రాష్ట్రాలలో 70 శాతం పాజిటివ్ కేసులు, 82 శాతం కోవిడ్ మరణాలు సంభవించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

మహారాష్ట్రలో లక్షా 52 వేల కేసులు, ఢిల్లీలో 77 వేలు, తమిళనాడులో 74 వేలు, గుజరాత్‌లో 30 వేలు, ఉత్తరప్రదేశ్‌లో 20 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో కలిపి దాదాపుగా 3.5 లక్షల కరోనా కేసులు, 12,600లకు పైగా మరణాలు చోటు చేసుకున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ వైరస్ విజృంభిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పదివేలకు పైగా కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ప్రతి రోజూ దాదాపు వెయ్యి కేసులు నమోదౌతున్నాయి.

click me!