కరోనాకి కోవిడ్ పాజిటివ్.. బిడ్డకు ప్రసవం

By telugu news teamFirst Published Oct 16, 2020, 1:13 PM IST
Highlights


కరోనా వైరస్ వచ్చిన కరోనా పేరు పెట్టడం కాదు.. అసలు ఆ మహిళ పేరే కరోనా. అసలు కరోనా అంటే.. దండ, కిరీటం అనే అర్థమట. అయితే.. ఈ కోవిడ్ వచ్చాక.. కరోనా అనే పదం అర్థమే మారిపోయింది. 
 

కరోనా ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు ఇప్పుడు అందరికీ సుపరిచితమైంది. కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతం చేసింది. అందుకే.. చిన్న పిల్లలనుంచి పండు ముసలివాళ్ల దాకా ఇప్పుడు ఎవరినోట విన్నా.. ఆ పేరే వినపడుతోంది. అయితే.. ఈ వైరస్ కాలంలో పుట్టిన చాలా మంది పిల్లలకు వాళ్ల తల్లిదండ్రులు కరోనా, కోవిడ్ అంటూ పేర్లు పెట్టారు. ఈ వార్తలు కూడా మీరు వినే ఉంటారు.

అయితే.. తాజాగా ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. కోవిడ్ సోకిన ఓ మహిళ ఇటీవల బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉంది. ఇందులో విచిత్రం, ఆసక్తికరం ఏమి ఉందని మీకు అనుమానం కలగొచ్చు. అయితే.. బిడ్డకు జన్మనిచ్చిన మహిళ పేరు కరోనా కావడం గమనార్హం. 

కరోనా వైరస్ వచ్చిన కరోనా పేరు పెట్టడం కాదు.. అసలు ఆ మహిళ పేరే కరోనా. అసలు కరోనా అంటే.. దండ, కిరీటం అనే అర్థమట. అయితే.. ఈ కోవిడ్ వచ్చాక.. కరోనా అనే పదం అర్థమే మారిపోయింది. 

తాజాగా.. ఓ మీడియా సంస్థ చేసిన సర్వేలో.. గతంలోనే కరోనా అని పేరు పెట్టుకున్న వారి వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే ఇటీవల కోవిడ్ సోకిన మహిళ పేరు కరోనా అని తేలింది. ఆమెకు ఇటీవల ఆడపిల్ల జన్మనివ్వగా.. తల్లీ, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు.

కరోనాకి ఎన్ఆర్ఐ బిజినెస్ మెన్ జిహుతో వివాహం జరిగింది. వీరికి అర్నబ్ అనే ఓ కుమారుడు కూడా ఉన్నాడు. కాగా. తాజాగా ఆమె మరోసారి గర్భం దాల్చింది. అయితే... కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయగా పాజిటివ్ అని తేలింది.

దీంతో ఆమెను కొల్లాంలోని మెడికల్ ఆస్పత్రిలో చేర్పించగా.. గత రాత్రి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కరోనా తండ్రి థామస్ మీడియాకు తెలియజేశారు. కాగా.. 24 సంవత్సరాల క్రితం థామస్ అనే వ్యక్తికి కవలపిల్లలు జన్మించారట. అబ్బాయికి కోరియల్ అని అమ్మాయికి కరోనా అని పేరు పెట్టారట. అప్పుడు తమ కుమార్తెకు పెట్టిన పేరు ఇప్పుడు ఇలా వైరస్ పేరు అవుతందని తాము ఊహించలేదని ఆయన చెబుతుండటం గమనార్హం.

click me!