కరోనాతో బీహార్ మంత్రి కపిల్ డియో కామత్ మృతి

Published : Oct 16, 2020, 10:44 AM IST
కరోనాతో బీహార్ మంత్రి కపిల్ డియో కామత్ మృతి

సారాంశం

కరోనాతో బీహార్ రాష్ట్ర మంత్రి కపిల్ డియో కామత్ శుక్రవారం నాడు మరణించాడు. ఆయన జనతాదళ్ (యూ) నాయకుడు. కరోనా సోకిన బీహార్ మంత్రి కామత్  పాట్నాలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు.  చికిత్స పొందుతూ ఇవాళ ఆయన మరణించాడు.

పాట్నా: కరోనాతో బీహార్ రాష్ట్ర మంత్రి కపిల్ డియో కామత్ శుక్రవారం నాడు మరణించాడు. ఆయన జనతాదళ్ (యూ) నాయకుడు. కరోనా సోకిన బీహార్ మంత్రి కామత్  పాట్నాలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు.  చికిత్స పొందుతూ ఇవాళ ఆయన మరణించాడు.

మంత్రి కిడ్నీ సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడుతున్నాడు. ఇదే సమయంలో కరోనా సోకింది. దీంతో ఆయన ట్రీట్ మెంట్ తీసుకొనేందుకు ఎయిమ్స్ లో చేరాడు.వెంటిలేటర్ పై ఆయన ఉన్నాడు.

మంత్రి కామత్ మరణంపై బీహార్ సీఎం నితీష్ కుమార్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయి లీడర్ కామత్ అంటూ ఆయన అభిప్రాయపడ్డారు. ట్విట్టర్ వేదికగా ఆయన కామత్ కు సంతాపం తెలిపారు.

అతను నైపుణ్యం కలిగిన నేత, ప్రజాదరణ పొందిన రాజకీయ నాయకుడు. ఆయన మరణంతో తాను వ్యక్తిగతంగా బాధపడుతున్నానని ఆయన చెప్పారు.

ఆయన మరణం రాజకీయ, సామాజిక రంగాల్లో కోలుకోలేని నష్టాన్ని కలిగించిందని ఆయన గుర్తు చేశారు. కామత్ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !