ప్రియుడికోసం భర్త హత్య.. సీరియల్ స్టైల్లో పక్కా స్కెచ్.. కానీ..

Published : Sep 22, 2022, 11:29 AM IST
ప్రియుడికోసం భర్త హత్య.. సీరియల్ స్టైల్లో పక్కా స్కెచ్.. కానీ..

సారాంశం

ప్రియుడితో సంబంధానికి అడ్డు వస్తున్నాడని భార్యను అతి దారుణంగా హతమార్చిందో భార్య. ఆ తరువాత ఎవరో దుండగులు చంపేశారని శోకాలు అందుకుంది. 

కర్ణాటక : ప్రియుని కోసం భర్తను చంపేస్తున్న సంఘటనలు కర్ణాటకలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి.  ఒక టీవీ సీరియల్ ప్రేరణతో వివాహిత తన భర్తను చంపిన వైనం.. మండ్య జిల్లా మళవళ్లి తాలూకాలో జరిగింది. మళవల్లి ఎన్ఈఎస్  లేఅవుట్ లో నివాసముంటున్న శశి కుమార్ (30)ని భార్య నాగమణి(28),  ప్రియుడు హేమంత్ (25)లు కలిసి ఆదివారం రాత్రి హత్య చేశారు. 

గార్మెంట్స్ పరిచయమై.. కనకపురలో గార్మెంట్స్ కు వెళుతున్న నాగమణికి హేమంత్ పరిచయమయ్యాడు. ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది.  ఇది తెలిసి భర్త ఆమెను పలుమార్లు మందలించాడు. మొబైల్ ఫోన్ లాక్కొని,, పనికి వెళ్ళవద్దని కట్టడి చేయడంతో ఆమె కోపం కట్టలు తెంచుకుంది. భర్తను తప్పిస్తే తమకు ఏ అడ్డూ ఉండదని  నాగమణి నిశ్చయించుకుంది. టీవీలో వచ్చే కన్నడ సీరియల్ శాంతం పాపం చూస్తూ అందులో మాదిరిగానే హత్యకు పథకం వేసింది.

CHENNAI: కొత్తజంట.. భార్యను 25 సార్లు కత్తితో పోడిచిన భర్త.. ఎందుకంటే..?

ప్రియుడితో కలిసి హత్య..
ఆదివారం రాత్రి ప్రియుడు హేమంత్ ను పిలిపించుకుంది.  నిద్రపోతున్న పిల్లల చేతులు, కాళ్లు కట్టేసి నోట్లో బట్టలు కుక్కారు.  తర్వాత మద్యం మత్తులో నిద్రిస్తున్న శశికుమార్ చున్నీతో గొంతు బిగించి హత్య చేశారు. ఆ తరువాత ఎవరో దుండగులు ఇంట్లోకి చొరబడి చంపేశారని నాగమణి ఏడుపు అందుకుంది. కొడుకు మృతిపై అనుమానంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా సోమవారం నాడు..  కోడలిని అరెస్టు చేసి విచారించగా నేరం ఒప్పుకుంది. దీంతో నాగమణిని, ప్రియుడు హేమంత్ ను రిమాండ్ కు తరలించారు. ఆమె ఇద్దరు పిల్లలు అనాధలుగా మారిపోయారు.

PREV
click me!

Recommended Stories

Reliance Jio : అంబానీ మామ న్యూఇయర్ గిప్ట్ ...జియో యూజర్స్ కి రూ.35,100 వేలు..!
Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే