CHENNAI: కొత్తజంట.. భార్యను 25 సార్లు కత్తితో పోడిచిన భర్త.. ఎందుకంటే..?

By Mahesh RajamoniFirst Published Sep 22, 2022, 11:02 AM IST
Highlights

Drunk auto driver stabs wife: మద్యం మత్తులో ఒక ఆటో డ్రైవర్ తన భార్యపై  కత్తితో దాడి చేశాడు. 25  కత్తిపోట్లకు గురైన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలతో పోరాడుతోంది. 
 

CHENNAI: కొత్తగా పెళ్లయిన జంట. మూడు నెలలు సంసారం బాగానే సాగింది. కానీ, మూడు నెలల తర్వాత భర్త క్రూరత్వం భయటపడింది. ప్రశ్నించినందుకు తన భార్యపై ఆ ఆటో డ్రైవర్ కత్తితో దాడి చేశారు. ఏకంగా 25 సార్లు ఆమె శరీరంపై పొడిచాడు. 25  కత్తిపోట్లకు గురైన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలతో పోరాడుతోంది. షాకింగ్ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

ఈ ఘటనకు సంబంధించిన పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. 26 ఏండ్ల ప్రసాద్ కు కొరుక్కుపేటలోని ఎగప్పన్ వీధికి చెందిన తమిళ్ సెల్వి (18)తో ఇటీవలే వివాహం జరిగింది. ప్రసాద్ ఆటోరిక్షా డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. మూడు నెలలు సంసారం బాగానే సాగింది. కానీ, మూడు నెలల తర్వాత భర్త క్రూరత్వం భయటపడింది. ప్రశ్నించినందుకు తన భార్యపై  మద్యం మత్తులో ఉన్న ఆటో డ్రైవర్ ప్రసాద్ కత్తితో దాడి చేశారు. 

నిత్యం మద్యం తాగివస్తుండటంతో మహిళ.. తన భర్తను ప్రశ్నించింది. కొన్ని రోజులుగా నిత్యం తాగి వస్తూ.. భార్యతో గొడవపడుతుండే వాడు. మంగళవారం కూడా వారి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే ఆవేశానికి లోనైన భర్త.. తన భార్యపై కత్తితో దాడి చేశాడు. 25 సార్లు కత్తితో పొడిచి ఆమెను గాయపర్చాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలు అరవడంతో ఇరుగుపొరుగువారు అక్కడికి చేరుకుని బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడిన భర్త అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

పోలీసు అధికారులు మాట్లాడుతూ.. ప్రసాద్‌కు మూడు నెలల క్రితం సెల్వితో వివాహమైందనీ, వీరు వ్యాసరపాడిలో నివాసం ఉంటున్నారని తెలిపారు. ప్రసాద్ మద్యం మత్తులో ఉండడంతో రోజూ మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యతో తరచూ గొడవ పడేవాడు. ఇంటి ఖర్చులకు డబ్బులు ఇవ్వకపోవడంతో మంగళవారం సెల్వి అతడిని మందలించింది. ఆవేశంతో ప్రసాద్ వంటగదిలో ఉన్న కత్తి తీసుకుని పదే పదే పొడిచాడు. ఆమె కేకలు విని ఇరుగుపొరుగు వారు వచ్చి రక్షించగా ప్రసాద్ తప్పించుకున్నాడు. ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించడంతో ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వ స్టాన్లీ ఆసుపత్రికి తరలించారు. ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణలు కొనసాగుతున్నాయి అని పోలీసులు తెలిపారు.

ఇదిలావుండగా, తమిళనాడులోనే ఓ వ్యక్తి 25 ఏళ్ల యువతిపై అత్యాచారం చేసి, ఆమె బంగారు గొలుసును దోచుకెళ్లిన ఐదేళ్ల తర్వాత, ఆ నేరానికి పాల్పడినట్లు నిర్ధారించి, 10 ఏళ్ల జైలు శిక్షను విధించింది కోర్టు. అల్లికులంలోని మహిళా కోర్టు విచారణ జరిపి నిందితుడికి మంగళవారం నాడు శిక్షను ఖరారు చేసింది. కోర్టు అతనికి ₹15,000 జరిమానాను కూడా విధించింది. అరివళగన్ తనను కత్తితో బెదిరించి అత్యాచారం చేశాడని ఆ మహిళ 2017లో గిండీ ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడిని అరెస్టు చేసి ఆమె నుంచి లాక్కున్న 3 సవర్ల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు.

click me!