గేట్లు తెరవడం ఆలస్యమయిందని.. సెక్యూరిటీ గార్డుల మీద మహిళ వీరంగం.. అరెస్ట్...

By Bukka SumabalaFirst Published Aug 22, 2022, 11:03 AM IST
Highlights

ఓ మహిళ గేటు తీయడం ఆలస్యమయిందని సెక్యూరిటీ గార్డుల మీద అసభ్యంగా ప్రవర్తించింది. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ మహిళను అరెస్ట్ చేసి, కస్టడీకి తరలించారు. 

న్యూఢిల్లీ : ఢిల్లీ సమీపంలోని గౌతమ్ బుద్ నగర్‌లో ఓ మహిళ తన రెసిడెన్షియల్ సొసైటీ సెక్యూరిటీ గార్డుతో వాగ్వాదానికి దిగిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అయ్యాయి. ఈ వీడియోలో, భవ్య రాయ్ అనే మహిళ అసభ్య పదజాలంతో దూషించడం, అసభ్యకరమైన సంజ్ఞలు చేయడం, సెక్యూరిటీ గార్డులలో ఒకరిని బెదిరించడం, అసభ్యంగా ప్రవర్తించడం వంటివి కనిపిస్తున్నాయి.

ఫిర్యాదు అందడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను స్టేషన్ కు తరలించారు. అయితే, ఆమె తన సొంత కారులో పోలీస్ స్టేషన్‌కు వెళ్లినట్లు, కారు లోపల పోలీసులు కూర్చున్నట్లు మరో వీడియోలో కనిపిస్తుంది. పోలీసులు ఆమె కారును స్వాధీనం చేసుకోవాలనుకుంటే. ఆమె దానిని తానే నడుపుతానని పట్టుబట్టిందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఆమెను పోలీసు వాహనంలో స్టేషన్ కు తీసుకెళ్లాలని నిబంధనలు చెబుతున్నాయి. అనంతరం ఆమెను కోర్టులో హాజరుపరిచి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు.

కుమార్తె దురుసు ప్రవర్తన.. తలదించుకున్న మిజోరాం ముఖ్యమంత్రి.. బహిరంగ క్షమాపణ చెబుతూ ట్వీట్..

ఆ మహిళ నిన్న నోయిడాలోని సెక్టార్ 126లోని జేపీ విష్‌టౌన్ సొసైటీ నుండి వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా, గేట్లు తెరవడంలో ఆలస్యం జరిగింది. "గేటు తెరవడానికి కొంత సమయం పట్టింది. మేడమ్ వెయిట్ చేయాల్సి వచ్చింది. అంతే.. దీంతో ఆమె కోపానికి వచ్చి అరుస్తూ దుర్భాషలాడడం ప్రారంభించింది" అని సెక్యూరిటీ గార్డు కరణ్ చౌదరి విలేకరులతో అన్నారు. సొసైటీ నివాసితుల్లో ఒకరైన అన్షి గుప్తా మాట్లాడుతూ, కార్లు ప్రవేశించినప్పుడు లేదా వెళ్లేటప్పుడు గార్డులు లైసెన్స్ ప్లేట్ నంబర్‌లను నోట్ చేసుకోవాలనే రూల్ ఉంది. 

"దీనివల్ల కొద్ది నిమిషాలు ఆలస్యమైంది. దీంతో ఆమె కారు నుండి బయటకు వచ్చింది. మిగిలిన విషయాలు మీకు తెలుసు" ఆమె చెప్పింది. మహిళ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అయితే, ఆమెను పరీక్షల నిమిత్తం ఇంకా పంపలేదు. భవ్య రాయ్ అనే మహిళ సొసైటీకి చెందిన భద్రతా సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తిస్తూ వీడియోలో పట్టుబడ్డారని పోలీసు సీనియర్ అధికారి భారతీ సింగ్ తెలిపారు. "సెక్యూరిటీ గార్డు ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి అరెస్టు చేశారు" అని ఆమె తెలిపారు.

భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 153A (సామరస్యానికి విఘాతం కలిగించే చర్యలు), 323 (స్వచ్ఛందంగా గాయపరచడం), 504 (ప్రజా శాంతికి విఘాతం కలిగించేలా ఉద్దేశపూర్వకంగా అవమానించడం), 506 (నేరపూరిత బెదిరింపు) కింద మహిళపై అభియోగాలు మోపారు. ఆమె మీద  కేసు నమోదు చేశాం... అని పోలీసులు చెప్పారు.

 

बदतमीजी और गुंडागर्दी का अंत कुछ ऐसे हुआ... pic.twitter.com/fPoqkOiXVk

— Swati Maliwal (@SwatiJaiHind)
click me!