సహజీవనం : గదిలో బంధించి అత్యాచారం, చిత్రహింసలు.. ఆపై...

Published : Jun 08, 2021, 04:31 PM IST
సహజీవనం : గదిలో బంధించి అత్యాచారం, చిత్రహింసలు.. ఆపై...

సారాంశం

కేరళలో దారుణం చోటు చేసుకుంది. లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న యువతిని ఆమె సహచరుడే గదిలో బంధించి.. ఆపై అత్యాచారం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ వివరాలు.. బాధిత యువతి, నిందితుడు గత కొన్నేళ్లుగా ఎర్నాకులం సిటీలోని మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో ఓ ప్లాట్ లో సహజీవనం చేస్తున్నారు.

మనసులు, అభిరుచులు, అభిప్రాయాలు కలిసిన జంట... వేరే బంధాలతో పనిలేకుండా కలిసి చేసే జీవనప్రయాణమే సహజీవనం. అలాంటి అందమైన ప్రయాణాన్ని అత్యంత భయంకరంగా మార్చేశాడో కిరాతకుడు. తనను నమ్మి, ప్రేమించి వచ్చిన యువతికి నరకం చూపించాడు. ఈ ఘటన కేరళలోని ఎర్నాకులంలో జరిగింది. 

కేరళలో దారుణం చోటు చేసుకుంది. లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న యువతిని ఆమె సహచరుడే గదిలో బంధించి.. ఆపై అత్యాచారం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ వివరాలు.. బాధిత యువతి, నిందితుడు గత కొన్నేళ్లుగా ఎర్నాకులం సిటీలోని మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో ఓ ప్లాట్ లో సహజీవనం చేస్తున్నారు.

ఈ క్రమంలో నిందితుడు గత కొద్ది కాలంగా యువతిని చిత్రహింసలకు గురి చేయసాగాడు. బాధితురాలిని అవమానిస్తూ, ఆమెపై అత్యాచారం చేస్తూ హింసించేవాడు. 

ఛూ.. మంతర్.. నా కాలు పడితేనే భారత్ లో కరోనా అంతం : స్వామి నిత్యానంద...

అంతేకాదు ఈ టార్చర్ గురించి ఎవరికైనా చెబితే బాధితురాలి పర్సనల్ ఫొటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని బెదిరించసాగాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం నిందితుడి ఆగడాలు మరింత మితిమీరాయి. ఏకంగా బాధితురాలిని గదిలో పెట్టి తాళం వేశాడు. ఆ తరువాత ఆమె మీద దాడి చేయడమే కాకుండా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాధితురాలు ఎర్నాకులం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. 

ఎలాగోలా అతడి చెర నుంచి తప్పించుకుని వేరే ప్రదేశంలో షెల్టర్ పొందుతున్నానని పోలీసులకు తెలిపింది. ఇక నిందితుడు తన దగ్గర్నుంచి ఇప్పటికే 5 లక్షల రూపాయలవరకు తీసుకున్నాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.

బాధితురాలి శరీరమంతా గాయాలున్నాయని పోలీసులు తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసేందుకు వెళ్లేసరికి.. నిందితుడు అప్పటికే పారిపోయాడు. ముందస్తు బెయిల్ కోరుతూ కేరళ హైకోర్టును ఆశ్రయించాడని పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu