రాజకీయంగానే విడిపోయాం.. మోడీతో అనుబంధం అలాగే వుంది: ఉద్ధవ్ థాక్రే ఆసక్తికర వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jun 8, 2021, 4:15 PM IST
Highlights

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీకి, శివసేనకి గ్యాప్ వచ్చిన సంగతి తెలిసిందే. పలు సందర్భాల్లో ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వంపై సేన నేతలు విరుచుకుపడ్డారు. కరోనా రాకతో ఇది మరింత తారాస్థాయికి చేరింది.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీకి, శివసేనకి గ్యాప్ వచ్చిన సంగతి తెలిసిందే. పలు సందర్భాల్లో ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వంపై సేన నేతలు విరుచుకుపడ్డారు. కరోనా రాకతో ఇది మరింత తారాస్థాయికి చేరింది. కోవిడ్ కేసులతో అల్లాడుతున్న మహారాష్ట్రకు కేంద్రం నుంచి సరైన సాయం అందలేదంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఘర్షణకు దిగారు. ఇలాంటి పరిస్ధితుల్లో శివసేన అధినేత, సీఎం ఉద్ధవ్ థాక్రే ప్రధాని మోడీతో సమావేశమవ్వడం ప్రాథాన్యం సంతరించుకుంది. 

అనంతరం థాక్రే మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోడీతో తన భేటీ పూర్తిగా వ్యక్తిగతమైనదని.. ఎలాంటి రాజకీయ కారణాలు లేవన్నారు. తనకు మోడీకి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని స్పష్టం చేశారు. రాజకీయంగా దూరమైనప్పటికీ.. తమ మధ్య ఇంకా మంచి సంబంధాలే కొనసాగుతున్నాయని ఉద్ధవ్ పేర్కొన్నారు. తాను కలవడానికి వెళ్లింది నవాజ్‌ షరీఫ్‌ (పాక్‌ మాజీ ప్రధాని) కాదని.. ప్రధాని మోడీతో వ్యక్తిగతంగా భేటీ అవడంలో తప్పేంటని ప్రశ్నించారు. 

Also Read:కరోనా: కేంద్రం తీరుపై శివసేన ఫైర్

మరాఠా రిజర్వేషన్లపైనే థాక్రే.. మోడీతో చర్చలు జరపనున్నట్లు వీరివురి భేటీ ముందు రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. మరాఠా రిజర్వేషన్లను కొట్టివేసిన సుప్రీంకోర్టు.. అలా రిజర్వేషన్లు కల్పించే అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సర్కార్‌ ఈ విషయంపై నేరుగా ఢిల్లీలో తేల్చుకునేందుకు సిద్ధమైనట్లు గత నెల 31న శివసేన అధికారిక పత్రిక సామ్నాలో కథనం ప్రచురితమైంది. 

మరాఠా వర్గాన్ని సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గంగా ప్రకటించాలని గత నెల థాక్రే.. ప్రధానికి లేఖ సైతం రాశారు. మరాఠా రిజర్వేషన్ల కేసులో సుప్రీంకోర్టు ఇటీవల కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. మరాఠాలు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడినట్లు స్పష్టమైన ఆధారాలేవీ లేవని, వారికి 16 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో 50 శాతం పరిమితికి మించి రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 
 

click me!