భర్తను చంపేసి పారిపోయిన మహిళ: ఎందుకంటే...

Published : Jun 09, 2020, 07:13 AM IST
భర్తను చంపేసి పారిపోయిన మహిళ: ఎందుకంటే...

సారాంశం

తమిళనాడులో ఘోరం జరిగింది. ఏరోడ్ జిల్లాలో ఓ మహిళ తన భర్తను చంపేసి పారిపోయింది. మద్యం సేవించి గొడవ పడుతున్న భర్తను వదిలేసి ఆమె పుట్టింటికి వచ్చింది. భర్త ఆమె వద్దకు వచ్చి గొడవ పడ్డాడు.

ఎరోడ్: తమిళనాడు రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ మహిళ తన భర్తను హత్య చేసి పారిపోయింది. సోమవారంనాడు తమిళనాడులోని ఎరోడ్ జిల్లా అంధియూరు సమీపంలో ఈ సంఘటన జరిగింది. భార్యాభర్తల గొడవ పడ్డారు. ఈ గొడవలో భార్య భర్తను చంపింది. పరారీలో ఉన్న మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

నిందితురాలిని ఎఫ్ మథలాయీ మేరి (40)గా గుర్తించారు. ఆమె అధియైూరు సమీపంలోని నాగలూరు గ్రామానికి చెందిన ఏ ఫ్రాన్సిస్ జేవియర్ (44) అనే వ్యక్తిని 22 ఏళ్ల క్రితం వివాహం చేసుకుంది. వారికి ముగ్గురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు.

ఫ్రాన్సిస్ కూలీగా పనిచేస్తుండేవాడు. అయితే, తరుచుగా మద్యం సేవించి భార్యతో గొడవపడుతూ ఉండేవాడు. దాంతో భర్తతో విడిపోవాలని మథలాయి కొన్నేళ్ల క్రితం నిర్ణయించుకుంది. నలుగురు పిల్లలను తీసుకుని తన తండ్రి వద్దకు వచ్చింది. 

సోమావరం ఉదయం జేవియర్ తన భార్యను కలవడానికి అత్తారింటికి వచ్చాడు. భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడ్డారు. గొడవలో అకస్మాత్తుగా భార్య రాయి తీసుకుని ఫ్రాన్సిస్ తలపై కొట్టింది. దాంతో జేవియర్ అక్కడికక్కడే మరణించాడు.

PREV
click me!

Recommended Stories

వినాశకాలే విపరీత బుద్ధి..అయోధ్యలో రాములోరి కళ్లెదుటే | Ayodhya Ram Mandir Donation Theft?
Indian Railways: మరీ ఇంత కక్కుర్తా? ట్రైన్‍లో దుప్పట్లు, ఫేస్ టవల్స్ ఎత్తుకెళ్లిన ప్యాసింజర్లు..రైల్వేకు రూ.కోట్ల నష్టం