30వేల అడుగుల ఎత్తులో బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

Published : Jun 08, 2020, 01:57 PM IST
30వేల అడుగుల ఎత్తులో బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

సారాంశం

ఈ నేపథ్యంలో శాటిలైట్ ఫోన్ ద్వారా డాక్టర్ ఇచ్చిన సూచనల ప్రకారం విమానం  సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి.. ఆ మహిళకు కాన్పు చేశారు.

ఓ మహిళ 30వేల అడుగుల ఎత్తులో బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంఘటన ఢిల్లీ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. జూన్ 6న దుబాయ్‌ నుంచి మనీలాకు బయల్దేరిన ఫిలిప్పిన్స్ ఎయిర్ లైన్స్‌కు చెందిన పీఆర్659 విమానంలో ప్రయాణిస్తున్న గర్భిణికి పురిటినొప్పులు వచ్చాయి. 

దీంతో విమాన సిబ్బంది ఈ విషయాన్ని ఎయిర్‌లైన్ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు వెంటనే స్పందించి డాక్టర్‌ను సంప్రదించారు. ఈ నేపథ్యంలో శాటిలైట్ ఫోన్ ద్వారా డాక్టర్ ఇచ్చిన సూచనల ప్రకారం విమానం  సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి.. ఆ మహిళకు కాన్పు చేశారు.

 కాగా.. 30వేల అడుగుల ఎత్తులో పుట్టిన శిశువుకు స్వాగతం పలికిన విమాన సిబ్బంది.. ఆ క్షణాలను సెలబ్రేట్ చేసుకున్నారు. పుట్టిన శిశివుతో ఫొటోలు దిగి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఆ  బాబుకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తల్లీ, బిడ్డ ఇద్దరి ఆరోగ్యం క్షేమంగా ఉందని వైద్యులు చెప్పారు.

PREV
click me!

Recommended Stories

PM Modi: 10 కోట్లు దాటిన మోదీ ఇన్‌స్టా ఫాలోవ‌ర్లు.. ప్ర‌ధానికి సోష‌ల్ మీడియా ద్వారా డ‌బ్బులొస్తాయా.?
Toll Pass : కేవలం రూ.340 టోల్ పాస్.. నెెలంతా ఫ్రీగా తిరగొచ్చు..!