
బీహార్ : Smart phone, social media, ఇంటర్నెట్ ప్రతీ ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత మనిషి జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గరనుంచి పండు ముసలి సహా స్మార్ట్ ఫోన్ కోసం అల్లాడుతున్నవారే ఎక్కడ చూసిన దర్శనమిస్తారు. ఇంకా చెప్పాలంటే కొంతమంది తినడానికి తిండి లేకపోయినా ఫర్వాలేదు ఏదోలా బతుకుతాం.. స్మార్ట్ ఫోన్ లేకపోతే జీవితం లేదు అన్న చందంగా ఉంది ప్రస్తుత పరిస్థితి.. తాజాగా ఓ మహిళ తన Cell phone మిస్ అయిందని బెంగతో Suicide చేసుకుని మరణించింది. ఈ విచిత్ర దారుణ ఘటన Biharలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
బీహార్ లోని పూర్నియా జిల్లాలో తన మొబైల్ ఫోన్ కనిపించడం లేదంటూ ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనం రేపింది. ఖాజాంచి హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హౌసింగ్ బోర్డు ఏరియాలోని ఈ దారుణ ఘటన చేసుకుంది. మహిళ భర్త బిట్టు సింగ్ స్వగ్రామం బనమ్నాఖికి వెళ్లాడు. కుమారుడు ఇంటి డాబాపై ఆడుకుంటున్న సమయంలో మహిళ ఆత్మహత్యకు పాల్పడిందని స్థానికులు చెబుతున్నారు.
కొడుకు టెర్రస్ మీది నుంచి కిందికి వచ్చి చూసినప్పుడు తల్లి ఉరివేసుకుని కనిపించింది. వెంటనే కొడుకు తన తండ్రికి ఫోన్ చేశాడు. ఈ విషయం తెలిసిన వెంటనే బిట్టు బనమ్నాఖి నుంచి పూర్నియాకు వచ్చాడు. స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసు బృందం విచారణ చేపట్టింది. పోలీసులు సంఘటనా స్థలంలో పరిశీలించగా మహిళ గదిలో పైకప్పుకు ఉరివేసుకుని కనిపించింది. అది హత్యా లేక ఆత్మహత్యా అనేది పోస్ట్ మార్టం తర్వాత మాత్రమే నిర్థారిస్తామని పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉండగా, రాజస్థాన్ లో ఓ బాలుడు... నిద్రిస్తున్న తల్లిదండ్రులపై గొడ్డలితో దాడి చేసి హతమార్చాడు. ఈ దుర్ఘటన రాజస్థాన్ లోని హనుమాన్ గఢ్ జిల్లా ఫేఫానా గ్రామంలో బుధవారం అర్థరాత్రి జరిగింది. ఆ బాలుడు డ్రగ్స్ కు అలవాటు పడ్డాడు. కొడుకు భవిష్యత్ డ్రగ్స్ వల్ల పాడైపోకూడదనున్న తల్లిదండ్రులు అతన్ని డీ ఎడిక్షన్ సెంటర్ కు తరలించారు. ఆ తరువాత ఇంటికి వచ్చినా ఆ మైనర్ తనను మళ్లీ తల్లిదండ్రులు.. De-addiction Centerకి తరలిస్తారనే అనుమానంతో కన్న తల్లిదండ్రుల మీదనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
డీఎడిక్షన్ కేంద్రం నుంచి బుధవారమే ఇంటికి తిరిగివచ్చిన బాలుడు అర్థరాత్రి వేళ ఆదమరిచి నిద్రిస్తున్న తల్లిదండ్రులైన ఇంద్రా, శశిపాల్ సహా తమ్ముడు అజయ్ పైనా గొడ్డలితో కిరాతకంగా దాడి చేశాడు. ఈ దాడిలో తల్లిదండ్రులు ఇంద్రా, శశిపాల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సోదరుడు అజయ్ కూడా చనిపోయాడని భావించిన బాలుడు... పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలుడి తల్లిదండ్రుల మృతదేహాలను శవపరీక్షకు పంపారు. కొన ఊపిరితో ఉన్న అజయ్ ను ఆస్పత్రిలో చేర్చారు.