ఉద్యోగం పోయిన మూడు రోజుల్లోనే మరో భారీ ఆఫర్... నెట్టింట మహిళ పోస్ట్ వైరల్

Published : Jan 31, 2023, 09:34 AM IST
ఉద్యోగం పోయిన మూడు రోజుల్లోనే మరో భారీ ఆఫర్...  నెట్టింట మహిళ పోస్ట్ వైరల్

సారాంశం

అలా పెట్టిన వారంతా దాదాపు బాధతో పెట్టినవారే. అయితే... ఓ మహిళ మాత్రం... ఆ ఉద్యోగం పోయినందుకు ఆనందం వ్యక్తం చేసింది.


ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద కంపెనీలు....  ట్విట్టర్, గూగుల్, మైక్రోసాఫ్ట్స్ లాంటివి లేఆఫ్ లు ప్రకటించాయి. వేల మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అలా ఉద్యోగాలు పోగొట్టుకున్న చాలా మంది ఎమోషనల్ అవుతూ... సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కూడా చూసే ఉంటారు. అలా పెట్టిన వారంతా దాదాపు బాధతో పెట్టినవారే. అయితే... ఓ మహిళ మాత్రం... ఆ ఉద్యోగం పోయినందుకు ఆనందం వ్యక్తం చేసింది. ఎందుకంటే.... ఆ ఉద్యోగానికి మంచిన మంచి జాబ్ ఆఫర్ ని ఆమె కొట్టేసింది. ఆ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయగా... అది కాస్త వైరల్ గా మారింది.

ఆ మహిళ... తనను ఓ కంపెనీ మంగళవారం ఉద్యోగం లో నుంచి తొలగిస్తే... శుక్రవారం మరో పెద్ద కంపెనీలో  50శాతం ఎక్కువ జీతం, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్  తో జాబ్ వచ్చింది అంటూ ట్విట్టర్ లో పేర్కొంది. ఆమె ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. వేలల్లో లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తుంది.  

 

కాగా... తనకు కష్ట సమయంలో అండగా ఉన్నవారికి ఈ సందర్భంగా ఆ మహిళ దన్యవాదాలు తెలియజేశారు. మనకు నచ్చినట్లుగా మనం ఉండాలని.. ఒకరు మనల్ని శాసించేలా ఉండకూడదని ఆమె ఈ సందర్భంగా తెలియజేయడం విశేషం.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

పెద్ద మనసుతో ఆదుకున్నారు..అందులో తప్పేంటీ? | Government jobs for Karur victims | CM Vijay
BJP : తెలంగాణ బిజెపికి బిగ్ షాక్... జాతీయ స్థాయిలో ఉన్న రెండు పదవులూ పాయే..!