వివాహేతర సంబంధం.. కొడుకు కళ్ల ముందే ప్రియుడితో కలిసి భర్తను చంపేసి...!

Published : Nov 04, 2022, 10:44 AM IST
వివాహేతర సంబంధం.. కొడుకు కళ్ల ముందే ప్రియుడితో కలిసి భర్తను చంపేసి...!

సారాంశం

ఓ మహిళ... మరో వ్యక్తి మోజులో పడి కట్టుకున్న భర్తను అతి దారుణంగా చంపేసింది. అది కళ్లారా చూసిన కన్నకొడుకు అసలు విషయం బయటకు చెప్పడంతో... నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు.

వివాహేతర సంబంధాలు జీవితాలను నాశనం చేస్తున్నాయి. కుటుంబాన్ని చిన్నా భిన్నం చేస్తున్నాయి.  పరాయి మోజులో పడి.. కట్టుకున్న వారినిమోసం చేసి పుట్టిన బిడ్డలను అనాథలను చేస్తున్నారు. తాజాగా ఓ మహిళ... మరో వ్యక్తి మోజులో పడి కట్టుకున్న భర్తను అతి దారుణంగా చంపేసింది. అది కళ్లారా చూసిన కన్నకొడుకు అసలు విషయం బయటకు చెప్పడంతో... నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోచోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నో పరిధి మోహన్ లాల్ గంజ్ ప్రాంతానికి చెందిన ప్రదీప్ అనే వ్యక్తికి జ్యోతి అనే యువతితో 11 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. కాగా....కొంత కాలం నుంచి ప్రదీప్ ఇంటికి  జ్యోతికి వరసకు తమ్ముడయ్యే రంగోలి సింగ్ అనే వ్యక్తి రావడం మొదలుపెట్టాడు. వరసకు తమ్ముడు అవుతాడనే  ఇంగితం కూడా లేకుండా... అతనితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

ఈ విషయం ప్రదీప్ కి తెలియడంతో ఇద్దరినీ హెచ్చరించాడు. అయినా... వారిద్దరూ ఏ మాత్రం మారలేదు. దీంతో... భార్య తీరు మారకపోవడంతో ప్రదీప్ విసిగిపోయి... జ్యోతిని ఇంట్లో నుంచి గెంటేశాడు. అప్పటి నుంచి ఆమె ప్రియుడితో కలిసే ఉంటుంది. అయితే... ఇటీవల అర్థరాత్రిపూట ప్రియుడితో కలిసి ఇంట్లోకి వచ్చిన  ఆమె... భర్తపై దాడి చేసి హత్య చేసింది.  అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది.ఇందతా ఆమె ముగ్గురు బిడ్డల్లో ఒకరు చూడటం గమనార్హం. ఆ బాలుడు వెళ్లి.. పక్కింటివారికి జరిగినదంతా చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి నిందతులను అరెస్టు చేశారు.

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !