
చెన్నై:తమిళనాడురాష్ట్రంలోని చెంగల్పట్టు జిల్లా కోదండరామ్ నగర్ లోని ఓ ఇంట్లో రిఫ్రిజిరేటర్ పేలి ముగ్గురు మృతి చెందారు. ఇంట్లో నిద్రిస్తున్న గిరిజ,రాథ, రాజ్ కుమార్ లు మరణించారని పోలీసులు చెప్పారు.మరో ఇద్దరు ఈ ఘటనలో గాయపడ్డారు.
చెంగల్పట్టు జిల్లాలోని ఉరుపాక్కం రైల్వేస్టేషన్ సమీపంలోని ఆర్ఆర్ బృందావన్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ లో రిఫ్రిజిరేటర్ ఒక్కసారిగా పేలింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే పేలుడు సంబవించిందని స్థానికులు చెబుతున్నారు.ఈ పేలుడుతో పొగలు అలుముకున్నాయి. దీంతో ఇరుగు పొరుగు వారు తలుపులు పగులకొట్టారు. రిఫ్రిజిరేటర్ పేలుడుతోవ్యాపించిన పొగ కారణంగా ఊపి రాడక గిరిజ ,ఆమె చెల్లెలు రాధ, బంధువు రామ్ కుమార్ మృతి చెందాడు. రామ్ కుమార్ భార్య భార్గవి, కూతురు ఆరాధన తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికంగా ఉన్న క్రోమ్ ఆసుపత్రికి తరలించారు. వీరంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
గత ఏడాది నవంబర్ లో అనారోగ్యంతో మరణించిన వారి బంధువుకు నివాళులర్పించేందుకు వచ్చి రిఫ్రిజిరేటర్ పేలుడుతో మరణించారు.గుడువాంచెరి పోలీసులు, మరైమలై నగర్ అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ చర్యలు చేపట్టారు.