వైరల్ వీడియో: పెళ్లిలో భార్యతో డ్యాన్స్ చేయాలనుకున్నాడు..కానీ..!

Published : Nov 04, 2022, 10:00 AM ISTUpdated : Nov 04, 2022, 10:03 AM IST
వైరల్ వీడియో: పెళ్లిలో భార్యతో డ్యాన్స్ చేయాలనుకున్నాడు..కానీ..!

సారాంశం

స్టైల్ గా తన భార్యను తీసుకొని డ్యాన్స్ చేశాడు. ఈ క్రమంలో... భార్యను ఎత్తాలలని అనుకున్నాడు. కానీ... ఆ ఫోస్ కాస్త బెడసి కొట్టి... బొక్క బోర్లా పడ్డాడు.

ఈ రోజుల్లో పెళ్లిళ్లలో డ్యాన్స్ లు వేయడం చాలా కామన్ అయిపోయింది. పెళ్లిలో భాగంగా ఈ మధ్య స్పెషల్ గా సంగీత్ కార్యక్రమాన్ని కూడా పెడుతున్నారు. అందులో భాగంగా... వధూవరులతో పాటు... వారి తల్లిదండ్రులు, బంధువులు కూడా డ్యాన్స్ లు చేస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి కూడా ఓ పెళ్లిలో డ్యాన్స్ చేశాడు. స్టైల్ గా తన భార్యను తీసుకొని డ్యాన్స్ చేశాడు. ఈ క్రమంలో... భార్యను ఎత్తాలలని అనుకున్నాడు. కానీ... ఆ ఫోస్ కాస్త బెడసి కొట్టి... బొక్క బోర్లా పడ్డాడు. ఆయన పడటమే కాదు.. భార్యను కూడా కింద పడేశాడు.  దీనికి సంబంధించిన వీడియో... నెట్టింట వైరల్ గా మారింది.

 

ఈ సంఘటన ఎక్కడ జరిగింది అనే విషయం తెలియదు కానీ.... సోషల్ మీడియాలో మాత్రం వైరల్ గా మారింది.  ఈ వీడియో చూసి అక్కడున్నవారంతా నవ్వేయడం గమనార్హం. సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది.  వీడియోలో చూపించిన దాని ప్రకారం.... పెళ్లి వేడుకలో  చాలా మంది డ్యాన్స్  లు చేస్తూ ఉన్నారు. వాళ్లని చూసి వారిలో ఉన్న ఓ వ్యక్తి కి ఉత్సాహం వచ్చింది. తాను కూడా డ్యాన్స్ చేయాలని అనుకున్నాడు. అయితే... తన భార్యతో కలిసి ఆ డ్యాన్స్ చేయాలని అనుకున్నాడు. అలా అనుకోవడమే బెడసి కొట్టింది.

మామూలుగా చేస్తే బాగానే ఉండేది. కానీ ఆయన  సినిమా స్టైల్లో డ్యాన్స్  చేసి.. అందరి దృష్టినీ ఆకర్షించాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా తన భార్యను చేతుల పైకి ఎత్తుకుని డ్యాన్స్ చేయాలని చూస్తాడు. తీరా పైకి ఎత్తుకునే సమయంలో ఆమె బరువును మోయలేక.. ఆ బరువను కంట్రోల్ చేయలేక  ఒక్కసారిగా ఇద్దరూ కిందపడిపోయారు. ఇద్దరూ కింద పడిపోవడం గమనార్హం. పాపం... ఎదో అనుకుంటే... ఏదో అయ్యిందే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu