రాఖీ పండుగ విషయంలో గొడవ.. నలుగురు బంధువులను అతి కిరాతకంగా చంపిన మహిళ..

Published : Aug 12, 2022, 01:44 PM IST
రాఖీ పండుగ విషయంలో గొడవ.. నలుగురు బంధువులను అతి కిరాతకంగా చంపిన మహిళ..

సారాంశం

రాఖీ వేళ ఓ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. చిన్న విషయంలో చెలరేగిన గొడవతో కుటుంబంలోని నలుగురిని అతి దారుణంగా హత్య చేసింది ఓ మహిళ.

హౌరా : పశ్చిమబెంగాల్ లోని హౌరాలో రాఖీ పండగ ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. రాఖీ పండుగ వేడులో ఓ కుటుంబంలో చెలరేగిన గొడవ కారణంగా ఇద్దరు మహిళలు, ఓ పురుషుడు, ఓ చిన్నారి అతి దారుణంగా హత్యకు గురయ్యారు. రాఖీ పూర్ణిమ పూజ విషయంలో కుటుంబ కలహాలు నలుగురి హత్యకు దారితీసిన సంఘటన హౌరాలోని ఎంసీ ఘోస్ లేన్ వద్ద బుధవారం జరిగింది. కుటుంబంలోని చిన్న కుమారుడి భార్య పల్లవి ఘోష్, ఆమె అత్త మాధవి (58), బావ దేబాషిస్ (36), అతని భార్య రేఖ (31)  వారి 13 ఏళ్ల పాపను హత్య చేసింది. ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. 

కాగా, మహిళ భర్త పరారీలో ఉన్నాడు. ఉమ్మడి కుటుంబానికి చెందిన నలుగురిని హత్య చేసేందుకు నిందితురాలు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు పల్లవి తన భర్త, ఎనిమిదేళ్ల కొడుకుతో కలిసి మొదటి అంతస్తులో ఉంటుంది. మృతులు, దేబాషిస్, అతని భార్య, కుమార్తె గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటారు.

కలకత్తాలో దారుణం.. పాతకక్షలతో ఒకే కుటుంబంలోని నలుగురు హత్య..

బుధవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో రాఖీ పండుగను ఇంట్లో జరుపుకునే విషయంలో కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇదే సమయంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని టాయిలెట్‌లో నళ్లా తిప్పి ఉంది. నీళ్లు పోతున్నాయి. దీంతో పల్లవికి కోపం వచ్చింది. రోజూ ఇలాగే నీళ్లు వేస్ట్ చేస్తున్నారని, దీనివల్ల తమకు నీళ్లు సరిపోవడం లేదంటూ గొడవకు దిగింది. ఈ విషయాన్ని తన అత్తకు ఫిర్యాదు చేసింది. 

అత్తగారు సర్దిచెప్పడానికి ప్రయత్నించగా.. వాగ్వాదం పెరిగింది. దీంతో కోడలు అందుబాటులో ఉన్న కత్తి తీసుకుని అత్తను పొడిచేసింది. అత్త అరుపులతో దేబాషిస్, అతని భార్య, పదమూడేళ్ల కూతురు అక్కడికి వచ్చారు. దీంతో వారిని కూడా పల్లవి కత్తితో విచక్షణారహితంగా పొడిచింది. మెడ, భుజం, ఛాతీ, చేతిపై తీవ్రగాయాలతో నలుగురు చనిపోయారు.

అయితే, విషయం బైటికి పొక్కడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసుల విచారణలో నలుగురిని తానే హత్య చేసినట్లు పల్లబి అంగీకరించింది. తనురోజంతా మందులు వాడుతున్నానని, అందుకే ఏం చేస్తున్నానో అర్థం కాలేదని పోలీసులకు చెప్పింది. దీంతో ఆమెకు మానసిక వ్యాధి ఏమైనా ఉందా.. అనే విషయాన్ని పరిశీలించేందుకు పోలీసులు వైద్యులను సంప్రదిస్తున్నారు. అయితే, తన బావ, అతని భార్య, అత్తగారు తనతో ప్రతీ చిన్న విషయానికి తరచూ గొడవలు పడుతుంటారని కూడా ఆమె పోలీసులకు తెలిపింది. ఈ విషయంగా స్థానికులను ప్రశ్నించగా.. ఆ కుటుంబం వారు పెద్దగా ఎవరితోనూ కలవరని తెలిపారు.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం