ప్రియుడితో రాసలీలలు.. తండ్రి అడ్డుగా ఉన్నాడని..

Published : Aug 15, 2020, 07:28 AM ISTUpdated : Aug 15, 2020, 07:30 AM IST
ప్రియుడితో రాసలీలలు.. తండ్రి అడ్డుగా ఉన్నాడని..

సారాంశం

భర్తకు బంధువు అయిన మురుగవేల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో అతను ఇంటికి తరచూ వస్తుండేవాడు. ఈ సంగతి తెలుసుకున్న ధనశేఖర్‌ కుమార్తెను నిలదీశాడు.

కన్న కూతురిని అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. అంగ రంగ వైభవంగా పెళ్లి కూడా జరిపించాడు. అయితే.. పెళ్లైన కొద్ది రోజులకే కూతురు భర్తను వదిలేసి వచ్చింది. పుట్టింటికి చేరిన కూతురిని మళ్లీ ఆదరించడం మొదలుపెట్టాడు. అయితే.. కూతురు భర్తను వదిలేసి రావడమే కాకుండా మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం కాస్త ఆ తండ్రికి తెలియడంతో.. తప్పు అని మందలించాడు. అదే అతను చేసిన నేరమైంది. తన అక్రమ సంబంధానికి తండ్రి అడ్డుగా ఉన్నాడని.. తల్లి తో కలిసి చంపేసింది. ఈ దారుణ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...విల్లుపురం సమీపంలోని వడవంపాళయంకు చెందిన ధనశేఖర్‌ (45) ఆలయ పూజారి. కాగా.. ధనశేఖర్‌ భార్య రాజేశ్వరి (40), కుమార్తె సత్య (20) ఉన్నారు. సత్యకు వివాహమైన కొద్ది నెలలకే భర్త నుంచి విడిపోయి పుట్టింటికి వచ్చింది. 

భర్తకు బంధువు అయిన మురుగవేల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో అతను ఇంటికి తరచూ వస్తుండేవాడు. ఈ సంగతి తెలుసుకున్న ధనశేఖర్‌ కుమార్తెను నిలదీశాడు. ఈ విషయంగా భార్యతో సైతం గొడవ పడ్డాడు. ఈ క్రమంలో ఈ నెల 12న తెల్లవారుజామున 1.45 గంటలకు ఇంటికి వచ్చిన ధనశేఖర్‌ భార్య, కుమార్తెతో గొడవపడి నిద్రపోయాడు. 

తల్లి, కుమార్తె అతన్ని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. నిద్రపోతున్న తండ్రిని సత్య కత్తితో పొడిచింది. రాజేశ్వరి కత్తిపీటతో గొంతు కోయడంతో అతను మృతి చెందాడు. మురుగవేల్‌ను ఇంటికి రప్పించి హత్య చేసిన ఆనవాళ్లు లేకుండా చేశారు. పోలీసులు రాజేశ్వరిని, సత్య, మురుగవేల్‌ను గురువారం సాయంత్రం అరెస్టు చేశారు. శుక్రవారం ఉదయం ముగ్గురిని విల్లుపురం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.

PREV
click me!

Recommended Stories

UPI Update : ఫోన్ పే, గూగుల్ పే నుండి తెలియని నంబర్లకు డబ్బులు పంపితే .. ఏం చేయాలో తెలుసా?
Top 5 Biggest Railway Stations : ఏ ముంబై, డిల్లీలోనో కాదు.. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?