కసాయి తల్లి... రెండు నెలల పసికందును చంపేసి...!

Published : Jan 19, 2023, 09:39 AM IST
కసాయి తల్లి... రెండు నెలల పసికందును చంపేసి...!

సారాంశం

ఆ తర్వాత తన బిడ్డను పిల్లి ఎత్తుకెళ్లిందంటూ నమ్మించే ప్రయత్నం చేసింది.

ఏ తల్లి అయినా తన బిడ్డలను ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటారు. వారి ప్రాణానికి తమ ప్రాణం అడ్డు వేసి మరీ కాపాడాలి అని అనుకుంటారు. కానీ... ఓ మహిళ మాత్రం దారుణంగా ప్రవర్తించింది. తన కన్న బిడ్డను దారుణంగా చంపేసింది. రెండు నెలల పసికందు అనే కనికరం లేకుండా ప్రవర్తించింది. తన కన్న బిడ్డ గొంతు నులిమి చంపేసింది.అనంతరం.. తన బిడ్డను పిల్లి ఎత్తుకుపోయిందంటూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా..... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఝాన్సీ నగరానికి చెందిన  ఓ మహిళ తన కన్న బిడ్డను దారుణంగా గొంతు నులిమి చంపేసింది.  ఆ తర్వాత.... బిడ్డ కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగంలోకి దిగి.... చిన్నారి కోసం వెతకగా... ఇంటి వెనుక కాలువలో శిశువు మృతదేహాన్ని గుర్తించారు. హత్య కేసుగా నమోదు చేసుకుని ఆ శిశువు తల్లిని విచారించడం ప్రారంభించారు. ఆదివారం తాను బయటికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చే లోపు ఇంట్లో పాప కనిపించకుండా పోయిందని తల్లి చెప్పింది. ఆ తర్వాత తన బిడ్డను పిల్లి ఎత్తుకెళ్లిందంటూ నమ్మించే ప్రయత్నం చేసింది.

అయితే.... ఆమె పై పోలీసులకు అనుమానం కలగడంతో... ఆమెను తమదైన శైలిలో విచారించగా...తాను నేరం చేసినట్లు ఆమె అంగీకిరంచడం గమనార్హం. పేదరికం కారణంగా కూతురిని పెంచి పోషించలేమనే భయంతోనే చంపేసినట్టు మహిళ తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేశారు.
 

PREV
click me!

Recommended Stories

Government Scheme : 8వ తరగతి పాసైతే చాలు, ఫ్రీగా రూ.48000 పొందండి.. ఇందుకోసం ఏం చేయాలో తెలుసా?
నేపాల్లో వరదల మధ్య గర్భిణిని కాపాడి హెలీకాఫ్టర్లో తరలించిన రెస్క్యూ టీమ్ Nepal Rescue Pregnant Woman