గోవా-ముంబై హైవేపై ట్రక్కును ఢీ కొన్న కారు, ఓ చిన్నారితో సహా 9 మంది మృతి..

Published : Jan 19, 2023, 09:05 AM IST
గోవా-ముంబై హైవేపై ట్రక్కును ఢీ కొన్న కారు, ఓ చిన్నారితో సహా 9 మంది మృతి..

సారాంశం

గురువారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో  ముంబై-గోవా హైవేపై మాంగావ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిదిమంది మృతి చెందారు. 

ముంబై : ముంబై-గోవా హైవేపై ఈరోజు ఉదయం కారు ట్రక్కును ఢీకొన్న ప్రమాదంలో ఓ చిన్నారి, ముగ్గురు మహిళలు సహా తొమ్మిది మంది మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో హైవేపై మాంగావ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

ట్రక్కు ముంబైకి వెళ్తుండగా, కారు రత్నగిరి జిల్లాలోని గుహగర్‌కు వెళుతోంది. ముక్కలు చెక్కలైన కారు అవశేషాలు ప్రమాదం ఎంత తీవ్రతంగా జరిగిందో సూచిస్తున్నాయి. మృతుల్లో ఐదుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. ప్రమాదంలో గాయపడిన చిన్నారిని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. హైవేపై ట్రాఫిక్ నిలిచిపోకుండా క్లియర్ చేసి.. ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

అమర వీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళి |Droupadi Murmu Pays Homage at National War Memorial
Fact: ఆ గ్రామంలో ఏ ఇంటికి తాళం వేయరు, అసలు తలుపులే ఉండవు.. ఏంటా గ్రామం, దాని కథేంటి.?